Amazon Prime : అమెజాన్ ప్రైమ్ సభ్యులకు బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఆ పని చేయలేరు.. ఇక ఇలా చేయాల్సిందే..!

Amazon Prime : అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం సరికొత్త ఫ్యామిలీ ప్రొగ్రామ్ రాబోతుంది. ఈ కొత్త ప్లాన్ ఏంటి? ఎవరికి బెనిఫిట్ ఉంటుంది?

Amazon Prime : అమెజాన్ ప్రైమ్ సభ్యులకు బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఆ పని చేయలేరు.. ఇక ఇలా చేయాల్సిందే..!

Amazon Prime

Updated On : September 5, 2025 / 12:37 PM IST

Amazon Prime : అమెజాన్ ప్రైమ్ సభ్యులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటినుంచి కంపెనీ ప్రైమ్ ఇన్వైట్ ప్రోగ్రామ్‌ను ఎత్తేస్తోంది. మీరు అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉంటే.. మీ ఇంటి వెలుపల నివసించే వ్యక్తులతో ఫ్రీ షిప్పింగ్ బెనిఫిట్స్ షేర్ చేయలేరు. ఒకే అడ్రస్ లో నివసించని వ్యక్తులు ఫ్యామిలీ ప్లాన్ షేర్ చేయలేరు.

ఇప్పుడు అమెజాన్ దీనికి సంబంధించి సమాచారాన్ని ఇమెయిల్స్ ద్వారా తమ కస్టమర్లకు నోటిఫికేషన్లను పంపుతోంది. గతంలో, అమెజాన్ ప్రైమ్ సభ్యులు తమ రెండు రోజుల ఉచిత డెలివరీ సౌకర్యాన్ని మరో వ్యక్తితో షేర్ చేసుకునే వీలుంది. ఇకపై అలా ఉండదు.

ప్రైమ్ ఇన్వైట్ ప్రోగ్రామ్ ఏంటి? :

వాస్తవానికి, ప్రైమ్ ఇన్వైట్ ప్రోగ్రామ్ అనేది అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అందించే ప్రత్యేక ఫీచర్. ఈ ఫీచర్ ప్రకారం.. ఏ ప్రైమ్ సభ్యుడైనా తనకు తెలిసిన వారితో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా తన ఫ్రీ షిప్పింగ్ సౌకర్యాన్ని షేర్ చేయొచ్చు. కనీసం ఇద్దరు వ్యక్తులు ఒక సభ్యత్వంపై అమెజాన్ ఫ్రీ షిప్పింగ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

ఇందుకోసం ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సభ్యత్వాలను తీసుకోవలసిన అవసరం లేదు. ఈ ఫీచర్ ఒకే అడ్రస్ లో నివసించకపోయినా లేదా ఒకరినొకరు కచ్చితంగా తెలిసిన వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చింది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రైమ్ సభ్యత్వాన్ని కొనుగోలు చేసేవారు.

Read Also : Renault Triber GST: జీఎస్టీ రేట్ కట్ తర్వాత మీకు అత్యంత లాభం చేకూర్చే 7 సీటర్ కార్ ఇదే.. ఎంత తగ్గుతుందంటే..

అమెజాన్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ : 
నివేదిక ప్రకారం.. అమెజాన్ ఇప్పుడు అమెజాన్ ఫ్యామిలీ ప్రోగ్రామ్ పేరుతో కొత్త ఫ్యామిలీ ప్లాన్ తీసుకురాబోతోంది. ఈ ప్లాన్ మొదటి షరతు ఏమిటంటే.. ప్రైమ్ సభ్యులు తమ సౌకర్యాలను ఒకే అడ్రస్ లో నివసించే వ్యక్తులతో మాత్రమే షేర్ చేయగలరు.

అంటే.. మీరు ప్రైమ్ సభ్యత్వం ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే, ఆ సభ్యత్వం ప్రయోజనాలను మీ ఇంట్లో నివసించే వ్యక్తులతో షేర్ చేయగలరు. కానీ, మీ కుటుంబ సభ్యుడు మీ చిరునామాలో నివసించకపోతే మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఆ ప్లాన్ ప్రయోజనాలను పొందలేరు.

కొత్త ప్లాన్ ఎప్పటినుంచి? :
అక్టోబర్ 1 నుంచి వ్యక్తిగత లేదా ఇప్పటివరకు షేర్డ్ ప్లాన్‌ వాడుతున్న వారు తమ సొంత ప్రైమ్ సభ్యత్వాన్ని పొందాల్సి ఉంటుంది. ఎవరైనా తమ అడ్రస్ లో నివసించే వ్యక్తులతో ప్రైమ్ మెంబర్ షిప్ బెనిఫిట్స్ పెంచుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వ పేజీని విజిట్ చేయాలి. షేర్ ప్రైమ్ బెనిఫిట్స్ సెక్షన్ లో అమెజాన్ ఫ్యామిలీ మ్యానేజ్ ఆప్షన్ ఎంచుకోండి. ఆ తర్వాత, ఫ్యామిలీ ప్లాన్ ఎవరినైనా యాడ్ చేసేందుకు ఇమెయిల్ ఇన్విటేషన్ పంపవచ్చు లేదా కలిసి సైన్ అప్ చేయవచ్చు.