PNB ATM Cash : పంజాబ్ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఈ ATM కార్డులపై క్యాష్ విత్‌డ్రా లిమిట్ 50% కట్! మీ కార్డ్ ఇదేనా?
PNB ATM Cash : పంజాబ్ నేషనల్ బ్యాంకు డెబిట్ కార్డుతో ఇప్పటినుంచి గతంలో కన్నా తక్కువ క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఎన్బీ కొత్త డెబిట్ కార్డ్ లిమిట్ రూల్స్ వచ్చే ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.
PNB ATM Cash
- పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్
- ఏప్రిల్ 1 నుంచి డెబిట్ కార్డులపై కొత్త రూల్స్
- ఏటీఎంల నుంచి రోజుకు తక్కువ క్యాష్ విత్‌డ్రా
PNB ATM Cash : పంజాబ్ నేషనల్ బ్యాంకు కస్టమర్లకు బిగ్ షాక్.. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( PNB) కొన్ని డెబిట్ కార్డులపై క్యాష్ విత్‌డ్రా లిమిట్స్ తగ్గించింది.
ఇప్పటినుంచి PNB డెబిట్ కార్డును వాడితే మీరు ఇప్పుడు ఏటీఎంల నుంచి రోజుకు తక్కువ క్యాష్ మాత్రమే విత్ డ్రా చేసుకోగలరు. పీఎన్బీ కొత్త డెబిట్ కార్డ్ పరిమితులు వచ్చే నెల, ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ఏ పీఎన్బీ డెబిట్ కార్డులపై క్యాష్ విత్‌డ్రా తగ్గించాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ డెబిట్ కార్డులపై రూ. 50వేలు క్యాష్ డిపాజిట్ లిమిట్ :
పంజాబ్ నేషనల్ బ్యాంకు కొన్ని డెబిట్ కార్డులపై రోజువారీ ఏటీఎం క్యాష్ డిపాజిట్ లిమిట్ రూ. లక్ష నుంచి రూ.50వేలకి తగ్గించింది.
- రూపే NCMC ప్లాటినం డొమెస్టిక్ డెబిట్ కార్డ్
- రూపే NCMC ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్
- రూపే ఉమెన్ పవర్ ప్లాటినం డెబిట్ కార్డ్
- రూపే PNB పలాష్ డెబిట్ కార్డ్ (రీసైకిల్డ్ PVC)
- రూపే బిజినెస్ ప్లాటినం NCMC డెబిట్ కార్డ్
- మాస్టర్ కార్డ్ ప్లాటీనం డెబిట్ కార్డ్
- వీసా గోల్డ్ డెబిట్ కార్డ్
- పీఎన్బీ మాస్టర్ కార్డ్ ప్లాటినం రైజ్ డెబిట్ కార్డ్
ఈ డెబిట్ కార్డులపై రూ. 75వేలు క్యాష్ విత్రా లిమిట్ :
పంజాబ్ నేషనల్ బ్యాంకు కొన్ని డెబిట్ కార్డులపై రోజువారీ ఏటీఎం క్యాష్ విత్ డ్రా లిమిట్ రూ.150,000 నుంచి రూ.75వేలకి తగ్గించింది.
- రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్
- పీఎన్బీ రూపే సెలెక్ట్ నియో
- పీఎన్బీ రూపే సెలెక్ట్ ఎక్సెల్
- వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్
- మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్
PNB డెబిట్ కార్డ్ లిమిట్ ఎలా మార్చాలి? :
మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు డెబిట్ కార్డ్ లిమిట్ మార్చాలంటే.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా PNBOne మొబైల్ యాప్ ద్వారా ఈజీగా లిమిట్ మార్చుకోవచ్చు
- ముందుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అవ్వండి.
- ఆపై వాల్యూ యాడెడ్ సర్వీసెస్‌కి వెళ్లండి.
- ఇప్పుడు డెబిట్ కార్డ్ కస్టమైజడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ అకౌంట్ నంబర్, సర్వీసును ఎంచుకోండి.
- కార్డ్ నంబర్, గడువు తేదీ, కార్డ్ పిన్ ఎంటర్ చేయండి.
- కొత్త లిమిట్ ఎంటర్ చేసి అప్డేట్పై క్లిక్ చేయండి.
- వెరిఫికేషన్ కోసం OTP కూడా ఎంటర్ చేయండి.
