Cash Loan Repayments : బంధువులకు ఇచ్చిన రుణంపై పన్ను చెల్లించాలా? రూ. 20వేలకు మించి క్యాష్ లోన్ పేమెంట్స్ పై ITR ఫైల్ చేయాలా?
Cash Loan Repayments : సెక్షన్ 269SS.. రూ. 20వేలకు పైగా క్యాష్ లోన్ పై మీ ఖాతాలో జమ చేసిన వ్యక్తిపై రుణ మొత్తానికి సమానమైన జరిమానా ఉంటుంది.

Cash Loan Repayments
Cash Loan Repayments : అదేపనిగా క్యాష్ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. సాధారణంగా చాలావరకూ క్యాష్ డిపాజిట్లపై ఎలాంటి పన్ను (Cash Loan Repayments) పడకపోవచ్చు. కానీ, కొన్నిసార్లు మీరు చేసే క్యాష్ డిపాజిట్లపై సరైన అవగాహన వివరణ ఇవ్వలేని పక్షంలో పన్ను చెల్లించాల్సి రావొచ్చు. ఒకవేళ, మీ బ్యాంక్ ఖాతాలో జరిగే అన్ని క్యాష్ డిపాజిట్లు పన్ను పరిధిలోకి రాకపోవచ్చు. ఐటీ శాఖ దృష్టిలో పడతారని మర్చిపోవద్దు.
ఇందులో ప్రధానంగా మీకు తెలిసిన బంధువులు లేదా ఎవరైనా ఈఎంఐ చెల్లింపుల కోసం మీ బ్యాంకు అకౌంటులో డబ్బులు డిపాజిట్ చేస్తే కొంచెం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి, ఈ ఆదాయం మీ చేతుల్లో ఉందా? మీ పన్ను బాధ్యత సున్నా అయినా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాల్సిన అవసరం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి.
ఉదాహరణకు.. ఒక వ్యక్తి.. ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడని అనుకుందాం.. తన బంధువులలో ఒకరికి రెండు రకాల లోన్లు తీసుకున్నాడు. ప్రతి నెలా ఈఎంఐ మొత్తాన్ని తన ఖాతాలో క్యాష్ రూపంలో డిపాజిట్ చేస్తున్నారు.
అయితే, అతడి వేతనంపై పన్ను ప్రాథమిక మినహాయింపు పరిమితి కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, సెక్షన్ 87A పన్ను రాయితీ కారణంగా జీతం నుంచి ఎలాంటి పన్ను ఉండదు. అయినప్పటికీ ఇంకా ఐటీఆర్ దాఖలు చేయలేదు. ఇలాంటి సందర్భాల్లో ఈఎంఐ తిరిగి చెల్లింపు కోసం తన ఖాతాలో జమ చేసిన నగదుపై పన్ను చెల్లించాలా? ఐటీఆర్ కూడా దాఖలు చేయాలా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Cash Loan Repayments : ఐటీ నిపుణుల సలహా :
మీ బంధువు మీ బ్యాంకు ఖాతాలో ఈఎంఐ చెల్లింపుల కోసం డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ మొత్తాన్ని మీరు అతనికి ఇచ్చిన రుణానికి తిరిగి చెల్లింపుగా పరిగణిస్తారు. దీనిపై మీకు ఎలాంటి పన్ను ఉండదని గమనించాలి.
Read Also : Amazon Prime : అమెజాన్ ప్రైమ్ సభ్యులకు బిగ్ షాక్.. అక్టోబర్ 1 నుంచి ఆ పని చేయలేరు.. ఇక ఇలా చేయాల్సిందే..!
లోన్ మొత్తాన్ని మీ బ్యాంకు అకౌంటులో డిపాజిట్ చేసిన తర్వాత మీరు డబ్బును విత్ డ్రా చేసి మీ బంధువుకు అప్పగించారని ఐటీశాఖ భావిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మీ బంధువు మీరు ఇచ్చిన మొత్తాన్ని నగదు రూపంలో రుణాన్ని అంగీకరించినట్లే.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269SS ప్రకారం.. రూ. 20వేల కన్నా ఎక్కువ క్యాష్ లోన్ ఇవ్వడం నిషేధం కాగా రుణ మొత్తానికి సమానమైన జరిమానాను మీ బంధువుపై విధించాల్సి ఉంటుంది. అంతేకాదు.. మీ బంధువులు ఎవరైనా మీ దగ్గర తీసుకున్న రుణం తిరిగి చెల్లించేందుకు మీ బ్యాంకు అకౌంటులో డబ్బులు జమ చేసినా కూడా సెక్షన్ 269T కింద నిషేధమే.
అప్పుడే ఐటీఆర్ ఫైలింగ్ :
ఎందుకంటే.. పన్ను శాఖ లావాదేవీని గమనిస్తే.. నగదు రూపంలో తిరిగి చెల్లించిన మొత్తానికి సమానమైన జరిమానా మీ బంధువుపై విధిస్తుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 139 ప్రకారం.. పన్ను మినహాయింపులకు ముందు మీ స్థూల ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించి ఉంటే.. మీ ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
పాత పన్ను విధానంలో, మినహాయింపు పరిమితి 60 ఏళ్లలోపు వ్యక్తులకు రూ. 2.5 లక్షలు, సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు నుంచి 80 ఏళ్లు ) రూ. 3 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు పైబడిన వారికి) రూ. 5 లక్షలు. కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులందరికీ మినహాయింపు పరిమితి రూ. 3 లక్షలు ఉంటుంది.
తప్పక తెలుసుకోండి :
ఐటీఆర్ దాఖలు చేయడం అనేది మీ పన్ను బాధ్యతపై ఆధారపడదు. సెక్షన్ 87A కింద రిబేట్ కారణంగా మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేనప్పటికీ కూడా మీరు ఇప్పటికీ మీ రిటర్న్‌లను దాఖలు చేయాల్సి రావొచ్చు.