Mumbai: ఉగ్ర కలకలం? 34 వాహనాల్లో “మానవ బాంబులు”.. భారత్‌లోకి 14 మంది ఉగ్రవాదులు వచ్చారంటూ మెసేజ్
ముంబై పోలీసులు ఆ బెదిరింపు మెసేజ్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Mumbai Police
Mumbai: ఉగ్రదాడులు జరగనున్నాయంటూ ముంబై ట్రాఫిక్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో నగరమంతా భద్రతను కట్టుదిట్టం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని 34 వాహనాల్లో “మానవ బాంబులు” అమర్చినట్లు, ఈ పేలుళ్లు మొత్తం ముంబైని కుదిపేస్తాయని మెసేజ్‌లో ఉంది. (Mumbai)
Also Read: బంగారానికే కాదు.. ఇక వెండికి కూడా హాల్‌మార్కింగ్.. స్వచ్ఛతను ఇలా గుర్తించవచ్చు..
“లష్కర్ ఏ జిహాది” నుంచి ఈ హెచ్చరిక పంపుతున్నట్లు అందులో ఉంది. 14 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించారని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు.
అలాగే ఈ దాడుల్లో 400 కిలోల ఆర్‌డీఎక్స్ పేలుడు పదార్థాన్ని ఉపయోగిస్తామని ఉంది. ముంబై పోలీసులు ఆ బెదిరింపు మెసేజ్‌పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తరుచూ బెదిరింపు మెసేజ్‌లు
ముంబై పోలీసులకు తరుచూ బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయి. “మా హెల్ప్‌లైన్‌కు తెలియని నంబర్ల నుంచి ఇలాంటి బెదిరింపు సందేశాలు తరచుగా వస్తుంటాయి. ఎక్కువసార్లు అవి మానసిక సమస్యలు ఉన్నవారి నుంచి లేదా మద్యం తాగిన వారి నుంచి వస్తాయి” అని ఓ అధికారి చెప్పారు.
“అయితే, ప్రతి సారి ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు దానిని సీరియస్‌గానే తీసుకోవాలి. ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించాలి. ఏదైనా ప్రదేశం గురించి బెదిరింపు వస్తే, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించి, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సాయంతో తనిఖీ చేయాలి” అని ఆయన తెలిపారు.
థానే జిల్లాలోని కల్వా రైల్వే స్టేషన్‌ను పేల్చివేస్తానని ఇటీవలే బాంబు బెదిరింపు కాల్ చేశాడు ఓ వ్యక్తి. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
గత సంవత్సరం సెప్టెంబరులో ముంబై పోలీసులకు ఇలాంటి ఉగ్ర బెదిరింపే వచ్చింది. ఆ తర్వాత నగరంలోని దేవాలయాలకు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఏదైనా కనపడితే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు.