APCOB Recruitment: డిగ్రీ అర్హతతో ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్‌లో జాబ్స్.. నెలకు రూ.85 వేల జీతం.. దరఖాస్తు వివరాలు మీకోసం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB Recruitment) విజయవాడల ప్రధాన కార్యాలయంలో 25 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది.

APCOB Recruitment: Andhra Pradesh State Cooperative Bank Limited Notification for 25 Manager Posts
APCOB Recruitment: బ్యాంకింగ్ రంగంలో లైఫ్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB Recruitment)నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా విజయవాడల ప్రధాన కార్యాలయంలో ఉన్న 25 మేనేజర్ (Scale-1) పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా సెప్టెంబర్ 10వ తేదీతో ముగియనుంది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ https://apcob.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బజాజ్, దివిస్ కంపెనీలల్లో జాబ్స్.. పూర్తి వివరాలు మీకోసం
విద్యార్హతలు:
- అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- అలాగే అభ్యర్థి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడై ఉండాలి.
- తెలుగు భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. అలాగే ఇంగ్లీష్, కంప్యూటర్ జ్ఞానం ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.07.2025 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు Scale-1 కింద నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ:
ఈ పోస్టులకు రెండు విభాగాల్లో ఎంపిక జరుగుతుంది. మొదటిది ఆన్‌లైన్ పరీక్ష, రెండవది ఇంటర్వ్యూ.