Tesla Factory in India : భారత్‌కు టెస్లా నిజంగా వస్తుందా? ఫ్యాక్టరీ నిర్మాణం ఇక్కడే ఎందుకు? ఎలన్ మస్క్ ఏమన్నాడో తెలుసా?

Tesla Factory in India : భారత్‌కు ఎలన్ మస్క్ కంపెనీ రానుందా? దేశంలో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం మస్క్ ప్రయత్నిస్తున్నారా? ఇందులో నిజమెంత? కంపెనీ సీఈఓ మస్క్ ఏమన్నారో తెలుసా?

Tesla factory in India : ప్రపంచ బిలియనీర్, ఎలన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ భారత్‌లో అడుగుపెట్టబోతుందా? దేశంలో టెస్లా ఫ్యాక్టరీని నిర్మించేందుకు మస్క్ ప్రయత్నాలు చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆదాయ మార్గాలను నిరంతరం అన్వేషించే మస్క్ కన్ను ఇప్పుడు భారత్‌పై పడింది. భారత మార్కెట్‌ను ఎలాగైనా కంపెనీ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని మస్క్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట.. ఇప్పటికే ఈ విషయమై టెస్లా అధికారులు భారతీయ అధికారులతో చర్చలు కూడా జరిపినట్టు వార్తలు వచ్చాయి. దేశీయ సేల్, ఎగుమతి కోసం ఎలక్ట్రిక్ కార్లను నిర్మించడమే లక్ష్యంగా భారత్‌లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని టెస్లా ప్రతిపాదించినట్టు గత వారమే నివేదిక తెలిపింది.

ఫ్యాక్టరీ సరే.. స్థలం ఎక్కడ? :
అయితే, టెస్లా కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుపై ఇప్పటివరకూ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలోనే భారత ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘అమెరికా ఆధారిత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో ఫ్యాక్టరీని నిర్మాంచాలనే యోచనలో ఉందని అన్నారు. మరో కొత్త నివేదిక ప్రకారం.. టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ ఈ ఏడాదిలో కొత్త ఫ్యాక్టరీ కోసం దేశంలో ఒక స్థలాన్ని ఎంచుకోనున్నాడట..

టెస్టా కంపెనీ వ్యాపార విస్తరణకు భారత్ ఒక అద్భుతమైన ప్రాంతంగా భావిస్తున్నాడట.. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ ఇదే విషయంపై మాట్లాడాడు. ఈ ఏడాది చివరి నాటికి టెస్లా కొత్త ఫ్యాక్టరీ కోసం స్థలాన్ని కూడా మస్క్ ఎంచుకోనున్నాడు. టెస్లా తయారీ ప్లాంట్ ఏర్పాటుకు భారత్ ఒక ఆసక్తికరమైన ప్రదేశమా అని అడిగిన ప్రశ్నకు మస్క్.. కచ్చితంగా సాధ్యమేనని మస్క్ సమాధానమిచ్చాడు..

Read Also : Amazon Employees Walk Off : అమెజాన్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి.. ఆఫీసుకు రాలేమంటే తొలగిస్తారా? విధుల నుంచి వాకౌట్‌కు టెకీల ప్లాన్..!

అప్పట్లో టెస్లా అభ్యర్థనను తిరస్కరించిన భారత్ :
భారత మార్కెట్లో టెస్లా ‘ఇండియా’ ముందుకు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాదిలో టెస్లా కార్లపై దిగుమతి పన్నును తగ్గించాలని కంపెనీ అభ్యర్థనను భారత్ నిరాకరించింది. ఆ తర్వాత మస్క్ కంపెనీ స్థానికంగా భారత్‌లో వాహనాలను తయారు చేయాలని భావిస్తోంది. అయితే, కార్ల తయారీ సంస్థ మొదటగా దిగుమతులతో మార్కెట్లో డిమాండ్‌ను టెస్టింగ్ చేయాలని చూస్తోంది.

A Tesla factory possible in India, Absolutely, says Elon Musk

అమెరికా బయటి దేశమైన షాంఘైలో టెస్లా ఒక ప్లాంట్‌ నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా అతిపెద్ద ఫ్యాక్టరీ ఇదే. జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్‌లో ఇదొకటి. ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా గ్లోబల్ అవుట్‌పుట్‌ను విస్తరించే ప్రయత్నంలో భాగంగా మెక్సికోలో గిగాఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

భారత్‌లో ఫ్యాక్టరీపై టెస్లా భారీగా ప్రణాళికలు :
భారత్‌లో తయారీ స్థావరాన్ని ఏర్పాటు చేసేందుకు టెస్లా ప్రణాళికలను సిద్ధం చేస్తోందంటూ ఐటీ మంత్రి చెప్పిన తర్వాత ఎలన్ మస్క్ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలే టెస్లా కంపెనీ భారత్‌లో ఏ ప్రదేశంలో ఫ్యాక్టరీ నిర్మిస్తుంది? అందుకు ఎంత పెట్టుబడి పెడుతుంది అనేది రివీల్ చేయలేదు. అదేమి చెప్పకుండానే కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని టెస్లా ప్రతిపాదించిందని నివేదిక తెలిపింది. అయితే, టెస్లా తక్కువ దిగుమతి పన్నులపై భారత అధికారులతో చర్చించలేదని నివేదిక పేర్కొంది. గత ఏడాదిలో టెస్లా ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే ప్రణాళికలను నిలిపివేసింది. షోరూమ్ స్థలం కోసం అన్వేషణను సైతం కంపెనీ విరమించుకుంది. తక్కువ దిగుమతి పన్నులను పొందడంలో విఫలమైంది. ఆ తర్వాత మళ్లీ టెస్లా ఫ్యాక్టరీ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Read Also : Netflix Users Share Password : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై పాస్‌వర్డ్ షేర్ చేస్తే.. ఎక్స్‌ట్రా డబ్బులు చెల్లించాల్సిందే.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!

ట్రెండింగ్ వార్తలు