Kavya Maran : ఆఖ‌రి బంతికి స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం.. ఎగిరిగంతులేసిన కావ్య పాప‌.. వైర‌ల్‌

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టింది.

Kavya Maran : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ‌ళ్లీ విజ‌యాల బాట ప‌ట్టింది. గురువారం ఉప్ప‌ల్ వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు తేడాతో గెలుపొందింది. ఆఖ‌రి బంతికి రాజ‌స్థాన్ విజ‌యానికి రెండు ప‌రుగులు కావాల్సి ఉండ‌గా ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ అద్భుత‌మైన యార్క‌ర్‌తో ఆర్ఆర్ ఆట‌గాడు రోమ‌న్ పావెల్‌ను ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ ప‌రుగు తేడాతో విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 201 ప‌రుగు చేసింది. హైద‌రాబాద్ బ్యాట‌ర్ల‌లో నితీశ్ రెడ్డి (76నాటౌట్; 42 బంతుల్లో 3 ఫోర్లు 8 సిక్స‌ర్లు), ట్రావిస్ హెడ్ (58; 44 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు బాద‌గా.. ఆఖ‌ర‌ల్లో క్లాసెన్ (42నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) పెను విధ్వంసం సృష్టించాడు. ఆర్ఆర్ బౌల‌ర్ల‌లో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీయ‌గా, సందీప్ శ‌ర్మ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

Suresh Raina : టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం..

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 200 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (67; 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), రియాన్ ప‌రాగ్ (77; 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), రొమెన్ పావెల్ (27; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించిన‌ప్ప‌టికీ ఒక్క ప‌రుగు తేడాతో ఓడిపోయింది.

ఎగిరి గంతులేసిన కావ్య మార‌న్‌..

ఆఖ‌రి బంతికి విజ‌యం సాధించ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ ప్రాంచైజీ య‌జ‌మాని కావ్య మార‌న్ ఆనందంతో ఎగిరి గంతులేశారు. హుషారుగా న‌వ్వుతూ క‌నిపించారు. ఆఖ‌రి ఓవ‌ర్ వేసి జ‌ట్టును గెలిపించిన భువ‌నేశ్వ‌ర్‌, మిగిలిన ఆట‌గాళ్లు ఒక‌రినొక‌రు హ‌త్తుకుని అభినంద‌లు తెలియ‌జేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. కావ్య పాపా మ‌ళ్లీ న‌వ్వింది అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ మ్యాచ్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ వ‌రుస‌గా రెండు మ్యాచులు ఓడిపోయింది.

T20 World Cup 2024 : కేఎల్ రాహుల్ కంటే సంజూ శాంస‌న్ బెట‌ర్‌.. కుండబ‌ద్ద‌లు కొట్టిన అజిత్ అగార్క‌ర్‌

ఎలాంటి గేమ్ ప్లాన్ లేదు..
ఆఖ‌రి ఓవర్ ఎలా వేయాలనే విషయంపై ఎలాంటి గేమ్ ప్లాన్ లేదని భువ‌నేశ్వ‌ర్ కుమార్ చెప్పాడు. ఫ‌లితం గురించి ఆలోచించ‌లేద‌ని తెలిపాడు. చివరి ఓవర్ వేయడానికి బంతిని అందుకున్నాక పాట్ కమిన్స్ తన దగ్గరకు వచ్చి ఫలితం ఎలా ఉన్నా ఫర్వాలేదంటూ ధైర్యం చెప్పాడని అన్నాడు. మ్యాచ్‌ను ఆఖ‌రి బంతి వరకూ తీసుకెళ్లాలని భావించానని, దానికి అనుగుణంగా బంతులను వేశాన‌న్నాడు. కాగా.. ఈ పిచ్‌పై బంతి ఇంతలా స్వింగ్ అవుతుందని అనుకోలేదని చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు