Amazon Mega Electronics Sale : అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డే సేల్.. ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!

Amazon Mega Electronics Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రానిక్స్‌ మరో సేల్‌తో తిరిగి వచ్చింది. ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లపై మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ ఈవెంట్‌ను ప్రకటించింది.

Amazon Mega Electronics Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రానిక్స్‌ (Amazon Electronics Day Sale) మరో సేల్‌తో తిరిగి వచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లపై మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ ఈవెంట్‌ (Amazon Mega Electronics Sale)ను ప్రకటించింది. ఈ సేల్ సమయంలో (Amazon) ప్రముఖ బ్రాండ్‌లైన Samsung, Apple, boat, Fire-Boltt, Lenovo, Canon, Sony, వంటి ల్యాప్‌టాప్‌లు, వేరబుల్ వస్తువులు, హెడ్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, PC యాక్సెసరీలు, కెమెరాలు, మరిన్నింటి వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై అద్భుతమైన డీల్స్, ఆఫర్‌లను అందిస్తుంది. అంతేకాదు.. అమెజాన్ అందించే మెగా ఎలక్ట్రానిక్స్ సేల్ మార్చి 10 నుంచి అందుబాటులోకి వచ్చింది.

అమెజాన్ వినియోగదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. వినియోగదారులు మార్చి 11, మార్చి 14 మధ్య HDFC బ్యాంక్, HSBC బ్యాంక్, Yes బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ సేల్ ఈవెంట్‌లో భాగంగా అమ్మకందారుల నుంచి ఆఫర్‌లు, డీల్‌లతో అమెజాన్‌లో పాపులర్ ప్రొడక్టులు కూడా అందుబాటులో ఉన్నాయి.

మీరు ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా స్మార్ట్‌వాచ్‌ని కూడా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. Amazon సరికొత్త ASUS VivoBook 14, Fire-Boltt Phoenix Round డయల్, boAt Airdopes Atom 81, Samsung Tab A8, Lenovo IdeaPad Slim 3పై అద్భుతమైన డీల్స్, ఆఫర్‌లతో అందుబాటులో ఉన్నాయి. మీకోసం ప్రొడక్టుల లిస్టును మీకోసం అందిస్తున్నాం.

Amazon Mega Electronics Day Sale _ Top deals on laptops, Smartwatches

Read Also : Amazon Prime Phones Sale : అమెజాన్ ప్రైమ్ ఫోన్స్ సేల్.. షావోమీ 12ప్రో, శాంసంగ్ గెలాక్సీ M13పై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి!

* ASUS VivoBook 14 ల్యాప్‌టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 35,990కి అందుబాటులో ఉంది.
* Lenovo IdeaPad Slim 3 ల్యాప్‌టాప్ 3 నెలల వరకు నో-కాస్ట్ EMIతో రూ. 33,490కి అందుబాటులో ఉంది.
* ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 1,699కి అందుబాటులో ఉంది.
* Apple Watch SE ధర రూ. 34,990కి లభిస్తుంది. మీరు బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి వాచ్‌పై రూ. 1500 డిస్కౌంట్ పొందవచ్చు.
* Fire-Boltt Ninja Call Pro ధర రూ. 1,599కి, నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్ రూ. 1,199కి అందుబాటులో ఉంది.
* boAt Airdopes Atom 81 ధర రూ. 999కి మాత్రమే అందుబాటులో ఉంది.
* boAt Aavante Bar Orion ధర రూ. 7,499 వద్ద అందుబాటులో ఉంది.
* Zebronics Zuk BAR 9500WS Pro ధర రూ. 14,999కి అందుబాటులో ఉంది.
* సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా ZV 1 రూ. 69,490కి అందుబాటులో ఉంది.
* లాజిటెక్ B170 వైర్‌లెస్ మౌస్ కనెక్టివిటీ, 12 నెలల బ్యాటరీ లైఫ్, ఆధునిక డిజైన్‌తో సరసమైన ధరలో అందుబాటులో ఉంది.

అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ ఈవెంట్ కొనుగోలుదారులు తమకు ఇష్టమైన ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులను డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సేల్‌లో వివిధ రకాల ప్రొడక్టులు, అనేక బ్రాండ్‌లు ఉన్నాయి. మార్చి 14 వరకు కస్టమర్‌లు అద్భుతమైన ఆఫర్‌లతో అనేక బెనిఫిట్స్ పొందవచ్చు.

Read Also : Best Smartphones in India : రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు