Apple Sale Days on Amazon : అమెజాన్‌లో ఆపిల్ సేల్ డేస్.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 సిరీస్‌ ధర.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఇప్పుడే కొనేసుకోండి..!

Apple Sale Days on Amazon : ఆపిల్ సేల్ డేస్ ఇప్పుడు జూన్ 17 వరకు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారంలో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max ఫోన్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Apple Sale Days begins on Amazon

Apple Sale Days on Amazon : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) కొత్త ఆపిల్ డేస్ సేల్‌ (Apple Sale Days)తో మళ్లీ మొదలైంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఆపిల్ అత్యధికంగా అమ్ముడవుతున్న ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ ఇప్పటికే మొదలైంది. లిమిటెడ్ పిరియడ్ సేల్ మాత్రమే.. ఒక వారం పాటు ఈ సేల్ కొనసాగుతుంది.

అందుకే, కొత్త ఐఫోన్ 14ను మరింత సరసమైన ధరకు కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారులు జూన్ 17లోపు డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ అనేక బ్యాంక్ కార్డ్‌లపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు ఫ్లాట్ డిస్కౌంట్లను అందిస్తోంది. అమెజాన్‌లో లేటెస్ట్ ఆపిల్ సేల్ డేస్ సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్‌ డీల్స్ గురించి ఓ లుక్కేయండి.

ఐఫోన్ 14 సిరీస్‌పై ఆపిల్ సేల్ డేస్ ఆఫర్లు ఇవే :
ఐఫోన్ 14పై సేల్ ఆఫర్ : ఆపిల్ గతేడాది ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రకటించింది. ఈ సిరీస్‌లో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max ఉన్నాయి. అమెజాన్‌లో ఆపిల్ సేల్ డేస్‌లో అన్ని మోడళ్లు తక్కువ ధరలకు లభిస్తాయి. 128GB మోడల్‌తో ఆపిల్ iPhone 14 అసలు ధర రూ. 79,999 నుంచి రూ. 67,999కి అందుబాటులో ఉంది.

Read Also : Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..!

దీని ప్రకారం.. ఆపిల్ యూజరలు 15 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదేవిధంగా, ఐఫోన్ 14 256GB వేరియంట్ 13 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఐఫోన్ ధర రూ. 89,900 నుంచి రూ.77,999కి తగ్గింది. 512GB స్టోరేజ్‌ కలిగిన ఐఫోన్ 14 అసలు ధర రూ. 1,09,900 నుంచి 11 శాతం తగ్గింపు తర్వాత రూ.97,999కి కొనుగోలు చేయవచ్చు.

Apple Sale Days begins on Amazon

ఐఫోన్ 14 ప్లస్‌పై అదిరే ఆఫర్ :
ఐఫోన్ 14తో పోలిస్తే.. పెద్ద స్క్రీన్, బ్యాటరీని కలిగిన ఐఫోన్ 14 ప్లస్ కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఆపిల్ ఐఫోన్ 14 Plus 128GB స్టోరేజీతో ఇప్పుడు రూ. 76,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 89,900 నుంచి 14 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా, ఐఫోన్ 14 ప్లస్ 256GB వేరియంట్ అమెజాన్ ఆపిల్ డే సేల్ సమయంలో అసలు ధర రూ. 99,900 నుంచి 13 శాతం తగ్గింపు తర్వాత రూ. 86,999కి అందుబాటులో ఉంది.

ఐఫోన్ 14 ప్రోపై ఆఫర్ :
ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో సహా ఐఫోన్ 14 సిరీస్ హై-ఎండ్ మోడల్‌లు కూడా ప్రస్తుతం సుమారు 9 శాతం తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ 14 Pro 128GB (అసలు ధర 1,29,900), 256GB (రూ. 1,39,900) మోడల్‌లు వరుసగా రూ. 1,19,999, రూ. 1,34,990 ధరతో అమ్మకానికి ఉన్నాయి.

ఐఫోన్ 14 Pro Max సేల్ డేస్ ఆఫర్ :
ఐఫోన్ 14 Pro Max (128GB) ధర రూ. 1,39,900 ఉండగా, ఇప్పుడు రూ. 1,27,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. అదేవిధంగా, ఐఫోన్ 14 Pro Max 256GB వేరియంట్ ధర రూ. 1,49,900గా ఉంది. అమెజాన్ ఆపిల్ డేస్ సేల్‌లో తగ్గింపు పొందిన తర్వాత రూ. 1,43,990కి కొనుగోలు చేయవచ్చు.

Read Also : Reliance Jio Plans : జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. 84 రోజుల వ్యాలిడిటీతో 2 కొత్త ప్లాన్లు.. మరెన్నో డేటా బెనిఫిట్స్, ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు