Gold Price Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంతంటే..

తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ...

Gold And Silver Price Today

Gold and Silver Price Today : బంగారం, వెండి ధరల దూకుడుకు బ్రేక్ పడింది. వరుసగా రెండోరోజు ధరలు తగ్గాయి. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై నిన్న రూ. 160 తగ్గగా.. ఇవాళ (శక్రవారం) రూ. 490 తగ్గింది. మరోవైపు వెండి ధర భారీగా తగ్గింది. నిన్న కిలో వెండిపై రూ. 1300 తగ్గగా, ఇవాళ (శుక్రవారం) రూ. 1450 తగ్గింది. దీంతో రెండు రోజుల్లోనే కిలో వెండిపై 2,750 తగ్గింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,150కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.74,350.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.68,300 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 74,500.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.68,150 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 74,350.
    చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,750 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 75,000కు చేరింది.

 

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా శుక్రవారం వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 1450 తగ్గింది. దీంతో ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 97, 750.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి ధర రూ.97,750.
    కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 93,250 వద్ద కొనసాగుతుంది.
    ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.93,250.
    బెంగళూరులో కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో అక్కడ ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 94,400 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు