Crypto currency Sharia : క్రిప్టో కరెన్సీ షరియాకి విరుద్ధం అన్న ముస్లిం మత పెద్దలు..కరెన్సీపై నిషేధం విధించిన దేశం

క్రిప్టో కరెన్సీ షరియాకి విరుద్ధం అన్న ముస్లిం మత పెద్దలు. దీంతో క్రిప్టో కరెన్సీపై నిషేధం ఆ దేశం నిషేధం విధించింది.

Crypto currency is against Sharia laws : క్రిప్టో కరెన్సీ. భవిష్యత్తు ఇక క్రిప్టో కరెన్సీదే అనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇక నోట్లు, కాయిన్లు కనిపించవనీ..క్రిప్టో కరెన్సీదే భవిష్యత్తు అని విశ్లేషకులు కూడా అంటున్న వేళ..ఓ దేశం క్రిప్టో కరెన్సీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. కేవలం వ్యతిరేకతే కాదు ఏకంగా క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించింది ఇండోనేషియా. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ షరియా చట్టాలకు వ్యతరేకమట. దీంతో ముస్లిం అత్యధికంగా ఉండే దేశమైన ఇండోనేషియా క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించింది. కాగా ప్రపంచలోనే అత్యధికమంది ముస్లింలు నివసిస్తున్న దేశంగా ఇండోనేషియాకు గుర్తింపు ఉంది. ఈక్రమంలో ఇండోనేషియాలో ఉండే ముస్లిం పెద్దలు క్రిప్టో కరెన్సీ షరియాకు విరుద్ధం అని..కాబట్టి క్రిప్టోను నిషేధించాలని నిర్ణయించారు.దీంతో ఇండోనేషియా క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించింది. దీని గురించి ఇండోనేషియా సెంట్రల్ బ్యాంకు అధికారికంగా ప్రకటించలేదు.

Read more : El Salvador Cryptocurrency : చిన్నదేశం..గొప్ప ఆలోచన..అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్‌ తయారీ ఘనత

ఓ వైపు ఫ్యూచర్‌ కరెన్సీగా బిజినెస్‌ టైకూన్లు క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తున్నారు. మరోవైపు అదే స్థాయిలో క్రిప్టో కరెన్సీపై విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఏషియా దేశాల్లో క్రిప్టో కరెన్సీపై ఆంక్షలు విధిస్తున్నాయి. నిషేధాలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు ఏకంగా మత పెద్దలు సైతం క్రిప్టో కరెన్సీ విషయంలో రంగంలోకి దిగారు. క్రిప్టో కరెన్సీ షరియాకు విరుద్ధమంటున్నారు.

ఇటీవల ఇండోనేషియా సెంట్రల్‌ బ్యాంకు, అక్కడి ప్రభుత్వం క్రిప్టో కరెన్సీపై ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలో తెలపాలంటూ నేషనల్‌​ ఉలేమా కౌన్సిల్‌ని కోరింది. క్రిప్టో కరెన్సీ తయారీ, చలామణీ వంటి తదితర విషయాలపై చర్చలు చేపట్టిన ఉలేమా బోర్డు చివరకు దాన్ని నిషేధించాలంటూ నిర్ణయం తీసుకుంది. క్రిప్టోలో ఇన్వెస్ట్‌మెంట్‌కి భద్రత లేకపోవడాన్ని కారణంగా చూపిస్తూ.. షరియా చట్టాలకు అది విరుద్ధమంటూ పేర్కొంది. పెట్టుబడికి తప్పకుండా లాభం వస్తుందని ఆధారాలు చూపిస్తే క్రిప్టో ట్రేడింగ్‌ చేసుకోవచ్చంటూ తెలిపింది.

Read more : Indian Currency : రూ.2000 నోటుపై నల్లటి గీతలు.. ఇవి ఎందుకోసమో ఎప్పుడైనా ఆలోచించారా..?
నేషనల్‌ ఉలేమా కౌన్సిల్‌ నిర్ణయంతో దేశంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు పూర్తిగా నిలిచిపోకపోయినా..ముస్లిం మతస్తులు మాత్రం పెట్టుబడి చేసేందుకు వెనుకాడుతారని నిపుణులు అంటున్నారు. ఈ నిర్ణయం గల్ఫ్‌ దేశాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అనే విషయంపై ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలో ఇండోనేషియా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ విషయాన్ని పరిశీలిస్తోంది. దీనిపై ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. ఇండోనేసియాలో సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో క్రిప్టో లావాదేవీలు 370 ట్రిలియన్ రూపాయలు ($26 బిలియన్లు)గా ఉన్నాయి.ఇండోనేషియా ముస్లిం మత పెద్దల వైఖరి ఇతర ముస్లిం-మెజారిటీ దేశాలలో వారి ప్రత్యర్ధుల నుండి వేరుగా ఉండవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ ఫ్రీ జోన్‌లో క్రిప్టో ట్రేడింగ్‌ను అనుమతించగా, బహ్రెయిన్ 2019 నుండి క్రిప్టో ఆస్తులకు మద్దతు ఇచ్చింది.

 

 

ట్రెండింగ్ వార్తలు