Gold Rate : అక్షయ తృతీయ రోజు మహిళలకు బిగ్‌షాక్ ఇచ్చిన బంగారం ధర.. రూ.90వేలకు చేరిన ..
అక్షయ తృతీయ రోజున మహిళలకు బంగారం, వెండి ధరలు బిగ్ షాకిచ్చాయి. ధరలు భారీగా పెరిగాయి.
- Harishth Thanniru
- Published On : May 10, 2024 / 10:41 AM IST
Gold Rate
Gold Silver Rate Today : బంగారం ధరల పెరుగుదల జోరు కొనసాగుతూనే ఉంది. అక్షయ తృతీయ రోజుకూడా బంగారం ధర భారీగా పెరిగింది. అక్షయ తృతీయను పవిత్రమైన రోజుగా ప్రజలు భావిస్తారు. ఈరోజున బంగారం కొనుగోళ్లకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే, బంగారం కొనుగోలు దారులకు ధరలు బిగ్ షాకిచ్చాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 850 పెరిగింది. అమాంతం భారీ మొత్తంలో గోల్డ్ ధర పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 1300 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.90వేల మార్క్ కు చేరింది.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,090 వద్దకు చేరింది. - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,150 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,240.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,000 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,090.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,050 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.73,150.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.90,000 ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 90,000.
కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.86,500.
బెంగళూరులో మాత్రం వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 450 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 84,750.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.
