కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.

Delhi liquor scam MCL Kavitha : ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. శుక్రవారం ఆమె బెయిల్ పిటీషన్ పై  హైకోర్టు విచారణను వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటీషన్ పై వాదనలకు ఈడీ సమయం కోరింది. దీంతో తదుపరి విచారణ మే 24వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Also Read : CM Jagan : మంగళగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం .. జనసంద్రంగా మారిన పాత బస్టాండ్ సెంటర్

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. తీహార్ జైలులో ఉండగానే సీబీఐ అధికారులు కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటీషన్ దాఖలు చేసింది. ఈనెల 6న కవిత పిటీషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు తుది ఉత్తర్వులను సవాల్ చేస్తూ కవిత హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. అయితే, కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తుదపరి విచారణ మే 24వ తేదీ వాయిదా వేసింది.

 

ట్రెండింగ్ వార్తలు