T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వేళ‌.. రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన డాషింగ్ ఓపెన‌ర్‌

న్యూజిలాండ్‌కు పెద్ద షాక్ త‌గిలింది.

T20 World Cup 2024 – Colin Munro : మ‌రో 22 రోజుల్లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానుంది. ఈ స‌మ‌యంలో న్యూజిలాండ్‌కు పెద్ద షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు కొలిన్ మున్రో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతోనే 37 ఏళ్ల మున్రో ఆట‌కు వీడ్కోలు ప‌లికాడు. పొట్టి ఫార్మాట్‌లో దూకుడుగా ఆడ‌డంలో ఎప్పుడూ రాజీ ప‌డ‌లేద‌ని, మెగా టోర్నీలో చోటు ద‌క్క‌క పోవ‌డం బాధ‌క‌లిగించింద‌ని చెప్పాడు.

దేశం త‌రుపున న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం ఎంతో గొప్ప‌నైన విష‌యం అని. త‌న జీవితంలో అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 123 సార్లు ఇలా దేశం కోసం ఆడిన‌ట్లు మున్రో చెప్పాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన త‌రువాత క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని భావించిన‌ట్లు తెలిపాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన‌ప్ప‌టికీ కూడా ప్రాంఛైజీ క్రికెట్ ఆడ‌నున్న‌ట్లు పేర్కొన్నాడు.

కోహ్లి మ‌నిషి కాదురా అయ్యా.. ర‌నౌట్ ఎలా చేశాడో చూశారా.. వీడియో వైర‌ల్

2021లో అంత‌ర్జాతీయ క్రికెట‌లో అడుగుపెట్టాడు మున్రో. వైట్ బాల్ స్పెష‌లిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. త‌న కెరీర్‌లో 57 వ‌న్డేలు, 65 టీ20 మ్యాచులు ఆడాడు. వ‌న్డేల్లో 1271 ప‌రుగులు, టీ20ల్లో 1724 ప‌రుగులు చేశాడు. టీ20ల్లో 47 బంతుల్లో సెంచ‌రీ చేసిన రికార్డు అత‌డి పేరిట ఉంది. 2018లో వెస్టిండీస్ పై ఈ ఘ‌న‌త సాధించాడు. కాగా.. పొట్టి ఫార్మాట్‌లో అత‌డు మూడు శ‌త‌కాలు బాదాడు. ఇక ఐపీఎల్‌లో 13 మ్యాచులు ఆడి 177 పరుగులు చేశాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు న్యూజిలాండ్ జ‌ట్టు ఇదే..

కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిఛెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిఛెల్ శాంట్నర్, ఈష్ సోధీ, టిమ్ సౌతీ.

ట్రావెలింగ్ రిజ‌ర్వు.. బెన్ సియర్స్

KL Rahul : కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోనున్న కేఎల్ రాహుల్‌.. తాజా ట్విస్ట్‌ ఇదే

 

ట్రెండింగ్ వార్తలు