కోహ్లి మ‌నిషి కాదురా అయ్యా.. ర‌నౌట్ ఎలా చేశాడో చూశారా.. వీడియో వైర‌ల్

ఎక్క‌డో మిణుకుమిణుకు మంటున్న ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కాపాడుకుంది.

కోహ్లి మ‌నిషి కాదురా అయ్యా.. ర‌నౌట్ ఎలా చేశాడో చూశారా.. వీడియో వైర‌ల్

screengrab from video posted on x by@ipl

Virat Kohli – Shashank Singh Run Out : ఎక్క‌డో మిణుకుమిణుకు మంటున్న ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు కాపాడుకుంది. గురువారం ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 60 ప‌ర‌గుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా త‌న నెట్‌ర‌న్‌రేటును గ‌ణ‌నీయంగా మెరుగుప‌ర‌చుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద‌ర‌గొట్టాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో దుమ్ములేపాడు.

మొద‌ట బ్యాటింగ్‌లో 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స‌ర్లు బాది 92 ప‌రుగులు చేయ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 241 ప‌రుగులు చేసింది. అనంత‌రం పంజాబ్ ల‌క్ష్య ఛేద‌న‌లో 17 ఓవ‌ర్ల‌లో 181 ప‌రుగుల‌కు ఆలౌటైంది. రీలీ రూసొ (61;27 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్స‌ర్లు) ఒంటరి పోరాటం చేశాడు.

KL Rahul : కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోనున్న కేఎల్ రాహుల్‌.. తాజా ట్విస్ట్‌ ఇదే

కాగా.. ఈ మ్యాచ్‌లో కోహ్లి మెరుపు ఫీల్డింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ సీజ‌న్‌లో మంచి ఫామ్‌లో ఉన్న పంజాబ్ బ్యాట‌ర్ శ‌శాంక్ సింగ్ (19 బంతుల్లో 37)ను ర‌నౌట్ చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవ‌ర్‌లో ఇది చోటు చేసుకుంది. ఈ ఓవ‌ర్‌ను లాకీ ఫెర్గూస‌న్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని నాలుగో బంతిని సామ్ క‌ర‌న్ షాట్ ఆడాడు. బంతి వెళ్లిన చోట ఫీల్డ‌ర్ లేక‌పోవ‌డంతో రెండో ప‌రుగుకు ప్ర‌య‌త్నించాడు. ఎక్క‌డో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి దాదాపుగా 20 మీట‌ర్ల దూరం ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి డైవ్ చేస్తూ డైరెక్టుగా వికెట్ల‌కు బంతిని త్రో చేశాడు.

బెయిల్స్ ప‌డిపోయాయి. ఆ స‌మయానికి శశాంక్ సింగ్ క్రీజును చేరుకోక‌పోవ‌డంతో అత‌డు ర‌నౌట్ అయ్యాడు. ఈ వికెట్ ఓ ర‌కంగా మ్యాచ్‌ను మలుపు తిప్పింద‌నే చెప్ప‌వ‌చ్చు. అప్ప‌టికే శ‌శాంక్ 19 బంతుల్లో 37 ప‌రుగులు చేశాడు.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి మ‌రో జట్టు అధికారికంగా నిష్క్రమణ

కాగా.. కోహ్లి ర‌నౌట్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చిరుత‌లాగా ప‌రిగెత్త‌డాడని, అత‌డు మ‌నిషి కాద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.