CM Jagan : మంగళగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం .. జనసంద్రంగా మారిన పాత బస్టాండ్ సెంటర్

ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు.

CM Jagan Election campaign : ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మంగళగిరి పాత బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించిన సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మరో మూడు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. ఐదేళ్ల భవిష్యత్ ను, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు ఇవి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు అవుతాయి. జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఉంటుందని ప్రజలకు జగన్ సూచించారు.

Also Read : DBT Scheme Funds : ఏపీలో డీపీటీల పంపిణీపై హైకోర్టు కీలక ఆదేశాలు.. షరతులతో కూడిన అనుమతి

మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలు 99శాతం అమలు చేశాం. నాడు నేడుతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. ఆరో తరగతి నుంచే డిజిటల్ బోధన అందించాం. 8వ తరగతి నుంచే విద్యార్థులకు ట్యాబ్ లు అందించాం. గోరుముద్ద, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేశాం. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇచ్చాం. ఈ ఐదేళ్లలోనే 2లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం, ఐదేళ్లలో లంచాలు, వివక్షలేకుండా పాలన అందించాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా పాలన సాగించామని జగన్ అన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలు అమలు చేశారా? ఇంటి దగ్గరకే రేషన్, పెన్షన్ గతంలో ఎప్పుడైనా ఇచ్చారా? అంటూ జగన్ ప్రశ్నించారు. ఎన్నికల రాగానే రంగురంగుల మ్యానిఫెస్టోతో సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారని జగన్ విమర్శించారు. 14ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? అని జగన్ ప్రశ్నించారు.

Also Read : Gold Rate : అక్షయ తృతీయ రోజు మహిళలకు బిగ్‌షాక్‌ ఇచ్చిన బంగారం ధర.. రూ.90వేలకు చేరిన ..

మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుకబడిన వర్గాలవారు ఈ నియోకవర్గంలో అధికంగా ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆర్కేను కాదని ఈసారి ఈ నియోజకవర్గం నుంచి బీసీ మహిళకు ఇచ్చాం. కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి ఏకంగా పెద్దపెద్దోళ్లు వచ్చి డబ్బుల మూటలతో ఎన్నికల్లో గెలవటానికి చూస్తున్నారు. వారి వద్దడబ్బులు తీసుకొని వైసీపీకి ఓటు వేయండి. ఎందుకంటే చంద్రబాబు ఎన్నికల్లో పంచే డబ్బు పేదల నుంచి దోచుకున్నదేనని జగన్ అన్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు