DBT Scheme Funds : ఏపీలో డీపీటీల పంపిణీపై హైకోర్టు కీలక ఆదేశాలు.. షరతులతో కూడిన అనుమతి

సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలన్న ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిధుల విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలను తాత్కాలికంగా

DBT Scheme Funds : ఏపీలో డీపీటీల పంపిణీపై హైకోర్టు కీలక ఆదేశాలు.. షరతులతో కూడిన అనుమతి

DBT Scheme Funds

AP Elections 2024 : సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఆపాలన్న ఈసీ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిధుల విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలను తాత్కాలికంగా నిపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈనెల 11 నుంచి 13వరకు నిధుల విడుదల చేయొద్దని ప్రభుత్వానికి సూచించింది. నిధుల పంపిణీ విషయాన్ని ప్రచారం చేయొద్దని స్పష్టం చేసిన న్యాయస్థానం.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఈసీకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ జూన్ 27కు వాయిదా వేసింది.

Also Read : CM Jagan : మంగళగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం .. జనసంద్రంగా మారిన పాత బస్టాండ్ సెంటర్

ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు దాదాపు 14వేల కోట్లను డీబీటీ ద్వారా పంపిణీకి… షరతులతో కూడిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు అనుమతితో ఈరోజు లబ్ధిదారులకు డీబీటీ ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇదిలాఉంటే.. డీబీటీ ద్వారా లబ్ధిదారులకు నిధుల విడుదలపై హైకోర్టు అనుమతి ఇచ్చినా ఈసీ నుంచి ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం నిరీక్షిస్తుంది. ఈసీ అనుమతి వచ్చిన తరువాత లబ్ధిదారులకు డీబీటీ ద్వారా ప్రభుత్వం నిధులు పంపిణీ చేయనుంది.