Oppo Reno 8 5G : ఒప్పో రెనో 8 5G ఫోన్లు.. లాంచ్‌కు ముందే లీక్.. ధర ఎంతో తెలిసిందోచ్..!

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారు ఒప్పో నుంచి రెనో 8 సిరీస్ 5G వస్తోంది. జూలై 18న ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్ అధికారికంగా లాంచ్ కావాల్సి ఉంది.

Oppo Reno 8 5G Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారు ఒప్పో నుంచి రెనో 8 సిరీస్ 5G వస్తోంది. జూలై 18న ఒప్పో రెనో 8 సిరీస్ ఫోన్ అధికారికంగా లాంచ్ కావాల్సి ఉంది. ఒప్పో రెనో 8 సిరీస్ నుంచి రెండు మోడల్ ఫోన్లు రానున్నాయి. అందులో ఒకటి Reno 8 5G ఫోన్, రెండోది ఒప్పో Reno 8 pro 5G ఫోన్ ఉన్నాయి. ఈ రెండు మోడళ్లు భారత మార్కెట్లో ఈ నెల 18న అందుబాటులోకి రానున్నాయి. అయితే లాంచ్‌కు ముందే ఒప్పో రెనో 8 5G ఫోన్ ధర వివరాలు లీక్ అయ్యాయి. కంపెనీ రెనో 8 సిరీస్‌లో ఈ రెనో 8 సిరీస్ 5G అనే రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టనుంది. టిప్‌స్టర్ సుధాన్షు ప్రకారం.. భారత మార్కెట్లో Oppo Reno 8 ధర రూ. 29,999 నుంచి ప్రారంభం కానుంది. అంతేకాదు.. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీని కూడా అందిస్తుంది.

Macbook Air M2 To Go On Sale In India Today

Oppo Reno 8 5G 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్స్ ధరలు వరుసగా రూ. 31,999, రూ. 33,990గా కంపెనీ నిర్ణయించింది. Oppo Reno 8 Pro 5G ఫోన్.. 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. రెనో 8 ప్రో 5G ధర రూ. 44,990 ఉంటుందని టిప్‌స్టర్ పేర్కొంది. Oppo జూలై 18న జరిగే ఈవెంట్‌లో అధికారిక ధర వివరాలను వెల్లడించనుంది. ఈ రెండు డివైజ్‌లు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500 mAh బ్యాటరీతో రానున్నాయని కంపెనీ ధృవీకరించింది. Reno 8 5Gలో MediaTek డైమెన్సిటీ 1300 SoC ఉంటుంది. అయితే Reno 8 Pro 5G డైమెన్సిటీ 8100-MAX SoCతో రానుంది. చైనాలో లాంచ్ అయిన రెనో 8 ప్రో ప్లస్ 5G భారత మార్కెట్లో రెనో 8ప్రో 5 జిగా లాంచ్ కానుంది.

రెనో 8 ప్రో 5G వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. రెనో 8 5G కూడా 50MP సోనీ IMX766 ప్రధాన కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. అల్ట్రావైడ్ సెన్సార్ ఉండదు. దానికి బదులుగా రెనో 8 5G 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలకు రెండు ఫోన్‌లు 32MP ఫ్రంట్ కెమెరాతో రానున్నాయి. రెనో 8 5G 6.43-అంగుళాల 90Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రెనో 8 ప్రో 5G 6.7 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 12-ఆధారిత ColorOS 12.1తో రానున్నాయి.

Read Also : Oppo Reno 8 India : ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు