పోలవరంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలు ఎదుర్కొందని చెప్పారు.

ఏడు మండలాలు ఏపీకి వచ్చాయి కాబట్టి పోలవరం మొదలుపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు నాయుడు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలు ఎదుర్కొందని చెప్పారు. తాము కోర్టు కేసులను అధిగమించి పోలవరం ప్రాజెక్టును చేపట్టామని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారని తెలిపారు. ఏజెన్సీతో పాటు సిబ్బందిని కూడా మార్చారన్నారు. రాయలసీమకు కూడా గోదావారి నీరు తీసుకువెళ్లే పరిస్థితి వస్తుందని తెలిపారు. 15 లక్షల క్యూసెక్కులు స్పిల్ వేపై డిశ్చార్జ్ అవుతాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం చేసిందని అన్నారు.

గత ప్రభుత్వ తీరు పోలవరానికి శాపంగా మారిందని చంద్రబాబు నాయుడు తెలిపారు. గత పాలకులు తన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారని చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే పోలవరం ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందని అన్నారు. టీడీపీ హయాంలోనే 72 శాతం పూర్తి చేశామని తెలిపారు. రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి శాపంగా మారారని అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారని చంద్రబాబు నాయుడు చెప్పారు.

Also Read: నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జిల‌ను నియమించిన బీజేపీ.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు

ట్రెండింగ్ వార్తలు