Royal Enfield Meteor 350 : కుర్రాళ్ల డ్రీమ్ బైక్.. కొత్త వేరియంట్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 బుల్లెట్.. టాప్ ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

Royal Enfield Meteor 350 : రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 ఇప్పుడు ఫైర్‌బాల్, స్టెల్లార్, అరోరా (కొత్త), సూపర్‌నోవా వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

Royal Enfield Meteor 350 Motorcycle gets new variant, Top features details in telugu

Royal Enfield Meteor 350 : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) మీటోర్ 350 అదనపు ఫీచర్లతో కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు 4 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అందులో ఫైర్‌బాల్, స్టెల్లార్, అరోరా (కొత్తది) సూపర్‌నోవా ఉండగా.. వేరియంట్ వారీగా మీటోర్ 350 ధరలు (ఎక్స్-షోరూమ్, చెన్నై) ఈ కింది విధంగా ఉన్నాయి.

Read Also : Royal Enfield Rentals : రాయల్ ఎన్‌ఫీల్డ్ రెంటల్స్ ప్రొగ్రామ్.. ఈ నగరాల్లో బుల్లెట్ బైకులు అద్దెకు ఇవ్వబడును..!

* మెటోర్ 350 ఫైర్‌బాల్ – రూ. 205,900
* మెటోర్ 350 స్టెల్లార్ – రూ. 215,900
* మెటోర్ 350 అరోరా (కొత్తది) – రూ. 219,900
* Meteor 350 Supernova – రూ. 229,900

రాయల్ ఎన్‌ఫీల్డ్ టాప్ ఫీచర్లు ఇవే :
Meteor 350 అరోరా అరోరా బ్లూ, అరోరా గ్రీన్, అరోరా బ్లాక్‌లలో కొత్త రేంజ్ కలర్లను పొందుతుంది. రెట్రో-ప్రేరేపిత ఫీచర్లు స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్లు, ఇంజన్, ఎగ్జాస్ట్ సిస్టమ్, కాంపోనెంట్‌లతో సహా క్రోమ్-ఫినిష్ భాగాలు, డీలక్స్ టూరింగ్ సీట్, ట్రిప్పర్ నావిగేషన్, LED హెడ్‌ల్యాంప్‌లు, అల్యూమినియం స్విచ్ క్యూబ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇతర 3 వేరియంట్‌లకు కూడా కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లను అందించింది.

టాప్-ఆఫ్-లైన్ సూపర్‌నోవా రేంజ్ ఇప్పుడు LED హెడ్‌ల్యాంప్, అల్యూమినియం స్విచ్ క్యూబ్‌లతో పాటు ఇతర ప్రీమియం ఎలిమెంట్స్, ఫీచర్‌లను పొందుతుంది. స్టెల్లార్ రేంజ్ ట్రిప్పర్ నావిగేషన్ డివైజ్ ప్రామాణిక ఫిట్‌మెంట్‌గా కలిగి ఉంది. అయితే, ఫైర్‌బాల్ స్టాండర్డ్ స్టాక్ కలర్‌గా బ్లాక్‌గా వస్తుంది.

Royal Enfield Meteor 350 Motorcycle gets new variant 

భారత మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లలో మెటోర్ 350 అద్భుతమైన విజయాన్ని అందిస్తుంది. చాలా మంది సుదూర రైడర్లు, మోటార్‌సైక్లింగ్ ఔత్సాహికులను ఆకట్టుకునేలా ఉందని కంపెనీ తెలిపింది. డైనమిక్ క్రూజింగ్ సామర్థ్యం, బైక్ పర్పార్మెన్స్ రైడర్లను మరింత ఆకర్షించేలా ఉందని రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి గోవిందరాజన్ అన్నారు.

‘అరోరా రేంజ్ అనేది రైడర్స్ కమ్యూనిటీతో నిరంతర పరస్పర చర్యల ఫలితంగా ఉందన్నారు. రెట్రో-ప్రేరేపిత క్రూయిజర్‌ల పట్ల బలమైన మొగ్గు చూపుతున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త రంగులు, ఫీచర్లతో కస్టమర్‌లలో స్వచ్ఛమైన రెట్రో-క్రూజింగ్ ఆనందాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.

Read Also : iPhone 15 Series : ఐఫోన్ 15 సిరీస్‌లో కొత్త 48MP రిజల్యూషన్ ఫొటోలను తీయొచ్చు.. ఎలా వాడాలంటే? ఇదిగో సింపుల్ గైడ్ మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు