Ashok Elluswamy: ఎలన్ మస్క్​’ఆటోపైలట్’ టీంలో ఫస్ట్ ఎంప్లాయ్.. భారత సంతతి ఇంజినీర్..!

టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలోన్ మస్క్ (Elon Musk) ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఆటోపైలట్ టీమ్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తికి చోటు దక్కింది.

Ashok Elluswamy : టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలోన్ మస్క్ (Elon Musk) ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఆటోపైలట్ టీమ్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తికి చోటు దక్కింది. సోషల్ మీడియా ద్వారా మస్క్ ఆటోపైలట్ టీంను నియమిస్తున్న మస్క్.. అందులో మొదటి భారతీయ సంతతి ఉద్యోగి పేరును వెల్లడించారు. అతడే.. అశోక్ ఎల్లుస్వామి (Ashok Elluswamy).. మస్క్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీకి ఆటోపైలట్ టీంలో మొదటి ఉద్యోగిగా చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఎలన్ మస్క్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. టెస్లా ఒక ఆటోపైలట్ టీమ్‌ ప్రారంభిస్తోంది.. అందులో మొదటి ఉద్యోగి ఇతడేనని మస్క్ వెల్లడించారు. టెస్లా ఆటో పైలట్ ఇంజినీరింగ్‌కు అశోక్ హెడ్ గా పనిచేయనున్నారని తెలిపారు. Andrej.. AI బృందానికి డైరెక్టర్‌గా ఉంటారని చెప్పారు. ఆటోపైలట్ AI బృందం ప్రతిభావంతమైనదని, ఇందులోని వారంతా ప్రపంచంలోని తెలివైన వ్యక్తుల్లో కొందరగా మస్క్ తెలిపారు.

టెస్లా కంపెనీలో చేరడానికి ముందు.. ఎల్లుస్వామి వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబ్, WABCO వెహికల్ కంట్రోల్ సిస్టమ్‌ విభాగంలో పనిచేశాడు. చెన్నైలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గిండీ నుంచి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. కార్నెగీ మెల్లన్ యూనివర్శిటీ నుంచి రోబోటిక్స్ సిస్టమ్ డెవలప్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసినట్టు మస్క్ ట్వీట్ ద్వారా తెలిపారు.


ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరించడంలో హార్డ్‌కోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్‌లు తనకు కావాలని మస్క్ అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా సరే జాబ్ అప్లికేషన్ పంపవచ్చునని తెలిపారు. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లేదా ఏఐలో ఏమైనా అనుభవం ఉంటే.. తమ రెజ్యుమ్ వివరాలను PDF ఫార్మాట్ లో పంపాలని మస్క్ తెలిపారు. ఫోర్భ్స్ ప్రకారం.. ఎలన్ మస్క్.. 282 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు.. అందులో ఎక్కువ మొత్తం టెస్లా స్టాక్ నుంచి ఎక్కువగా రాబడి సాధిస్తున్నారు.

Read Also : Fire Accident: తగలబడ్డ థియేటర్.. నిర్లక్ష్యమే కారణమా..!

ట్రెండింగ్ వార్తలు