Twitter CEO Elon Musk : పొరపాటు మాదే.. కొంతమంది ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు సరైనది కాదు.. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నాం..!

Twitter CEO Elon Musk : ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం సరైనది కాదని, గత ఏడాదిలో ఉద్యోగులను తగ్గించే సమయంలో కొంతమంది ఉద్యోగులను తొలగించాల్సింది కాదని ఎలన్ మస్క్ వెల్లడించారు.

Twitter CEO Elon Musk admits some firing employees not correct : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) టేకోవర్ చేసిన తర్వాత ఆ కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ (Elon Musk) అనేక మార్పులు తీసుకొచ్చాడు. ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపుల నుంచి కంపెనీ విధానాల్లోనూ అనేక కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చాడు. ట్విట్టర్ ఉద్యోగుల్లో వేలాది మందిని విచక్షణ లేకుండా మస్క్ తొలగించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఉద్యోగుల తొలగింపుల విషయంలో జరిగిన పొరపాటును ఇప్పుడు మస్క్ అంగీకరించాడు. కొంతమంది ఉద్యోగులను అనవసరంగా కంపెనీ నుంచి తొలగించినట్టు మస్క్ అభిప్రాయపడ్డాడు. అకారణంగా తొలగించిన ట్విట్టర్ ఉద్యోగులను తిరిగి కంపెనీలోకి తీసుకుంటున్నట్టు మస్క్ వెల్లడించాడు.

గత కొన్ని నెలలుగా తొలగించిన కొంతమంది ఉద్యోగులను ట్విట్టర్ తిరిగి నియమించుకుంటోంది. ఇటీవలే టెస్లా వాటాదారుల సమావేశం అనంతరం ఎలోన్ మస్క్ ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఉద్యోగుల తొలగింపులు సరైన పద్ధతిలో జరగలేదని ఆయన అంగీకరించారు. ట్విట్టర్ చాలా మంది ఉద్యోగులను తొలగించి ఉండకూడదని బిలియనీర్ అభిప్రాయపడ్డారు. లేఆఫ్ నిర్ణయం సరైనది కాదని భావిస్తున్నట్టు తెలిపారు. గత ఏడాదిలో శ్రామిక శక్తిని తగ్గించే సమయంలో కొంతమంది ఉద్యోగులను తొలగించాల్సింది కాదని మస్క్ పేర్కొన్నారు. ట్విటర్‌ను ఆర్థికంగా గాడిలో పెట్టేందుకు ఉద్యోగుల తొలగింపు అనేది తప్పక చేయాల్సి వచ్చిందని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.

Read Also : Elon Musk Bodyguards : భయంభయంగా మస్క్.. బాత్‌రూంకు వెళ్లినా ఇద్దరు బాడీగార్డులు ఉండాల్సిందే.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

పొరపాటుకు చింతిస్తున్నాం.. తిరిగి ఉద్యోగంలో చేరండి :
ఏదిఏమైనా.. కొందరి ఉద్యోగులను తొలగించడం ద్వారా వారి ఫ్యామిలీ రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని మస్క్ తెలిపారు. ఇంతకుముందు కంపెనీకి రిజైన్ చేసి వెళ్లిపోవాలని కోరిన కొంతమంది ఉద్యోగులను తిరిగి తీసుకురావాలని ట్విట్టర్ యోచిస్తోంది. మస్క్ చేసిన పొరపాటు చర్యలను సరిదిద్దుకోవాలని భావిస్తున్నట్టు కంపెనీ సూచిస్తోందని ఆయన తెలిపారు. కానీ, తొలగించిన ఉద్యోగులు ట్విట్టర్‌లో తిరిగి చేరడానికి ఎలోన్ మస్క్ కింద పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారా అనేది లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. మస్క్ నాయకత్వంలో పనిచేసేందుకు ఉద్యోగులు అంగీకరిస్తారా? లేదా అనే సందేహం రాకమానదు. ఎందుకంటే.. మస్క్ ఎప్పుడు ఏమి చేస్తాడో అతడికే తెలియదని చాలా మంది ఉద్యోగులు విమర్శిస్తున్నారు.

Twitter CEO Elon Musk : Twitter to re-hire some employees, Elon Musk admits some firing were not correct

అక్టోబర్ 2022లో ట్విట్టర్‌ను తన అధీనంలోకి తెచ్చుకున్న మస్క్.. గత ఏడాది నవంబర్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాడు. అదే సంవత్సరంలో దాదాపు 50 శాతం మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించాడు. ఆ తరువాత మరింత మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించాడు. మస్క్ తనకు వ్యతిరేకంగా వెళ్లిన లేదా ట్విట్టర్‌లో తనను విమర్శించిన లేదా కంపెనీ లోపల జరుగుతున్న వాటి గురించి మాట్లాడిన ఉద్యోగులను కూడా మస్క్ తొలగించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

వేలాది మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత ట్విట్టర్ వర్క్‌ఫోర్స్ 100 శాతం నుంచి 20 శాతానికి పడిపోయింది. నివేదికల ప్రకారం.. కంపెనీలో సుమారు 1,500 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. అంటే.. కంపెనీలో దాదాపు 7,800 నుంచి తగ్గింది. వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ గురించి కూడా ఎలన్ మస్క్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇంటి నుంచి పని చేయడం నైతికంగా సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు ఆఫీసుల్లో నుంచి పనిచేస్తేనే మెరుగైన ఫలితాలను అందించగలరని ఆయన చెప్పారు.

Read Also : New Twitter CEO : ట్విట్టర్ కొత్త సీఈఓగా లిండా యక్కరినో.. తొలి మహిళా సీఈఓ ఈమెనే.. ఎలన్ మస్క్ క్లారిటీ..!

ట్రెండింగ్ వార్తలు