Bengal white tiger ( Image Credit : Wikipedia/Google )
Bengal Tiger : హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూ పార్క్‌లో మంగళవారం సాయంత్రం (మే 14) బెంగాల్ టైగర్ (తెల్ల పులి) మృతిచెందింది.
9 ఏళ్ల వయస్సు ఉన్న అభిమన్యు అనే పేరు గల ఈ పెద్ద పులి గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. 2015 జనవరి 2న జన్మించిన అభిమన్యు.. పులి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో చివరికి ప్రాణాలు వదిలింది.
బెంగాల్ టైగర్‌ను రక్షించేందుకు మెరుగైన చికిత్సలు అందించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని జూపార్క్ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి నెహ్రూ జూపార్క్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
Read Also : Cm Revanth Reddy : మినిమం 9, మ్యాగ్జిమం 13..! కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుందో చెప్పేసిన సీఎం రేవంత్