కరీంనగర్ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నాయ్- బండి సంజయ్

ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు అనేక అడ్డదారులు తొక్కారు. ప్రభుత్వం ఇకనైనా హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు.

Bandi Sanjay : జూన్ 4న కరీంనగర్ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నాయ్ అని కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. హిందువులంతా ఏకమైతే ఫలితాలు ఎలా ఉంటాయో కరీంనగర్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన చెప్పారు. ఆరోజు కేసీఆర్ డాక్టర్లను పక్కన పెట్టుకుంటే బెటర్ అని సూచించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు అనేక అడ్డదారులు తొక్కారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం ఇకనైనా హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు.

ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని బండి సంజయ్ వాపోయారు. ఇచ్చిన హామీల అమలుకు విధివిధానాలు రూపొందించాలని సూచించారు. లేని పక్షంలో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మండిపడ్డారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాలు ఏం చేయలేని పరిస్థితి ఉందన్నారు బండి సంజయ్.

Also Read : మినిమం 9, మ్యాగ్జిమం 13..! కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుందో చెప్పేసిన సీఎం రేవంత్

ట్రెండింగ్ వార్తలు