NIRF Ranking 2024 : ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్.. ఉన్నత విద్య కోసం విద్యార్థుల అన్వేషణ.. భారత్‌లో టాప్ 20 కాలేజీలివే..!

NIRF Ranking 2024 : ఉన్నత విద్యను అభ్యసించడానికి దేశవ్యాప్తంగా, విదేశాల్లోని కాలేజీల కోసం అన్వేషిస్తున్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2023 ప్రకారం.. దేశంలోని టాప్ 20 కాలేజీలను జాబితాను విడుదల చేసింది.

NIRF Ranking 2024 : Check List Of Top 20 colleges in India ( Image Credit : Google )

NIRF Ranking 2024 : సీబీఎస్ఈ ఫలితాలు వచ్చేశాయి. 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించి ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇప్పటికే చాలా బోర్డులు 12వ తరగతి ఫలితాలు ప్రకటించాయి. సీబీఎస్ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పై చదువుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి దేశవ్యాప్తంగా, విదేశాల్లోని కాలేజీల కోసం అన్వేషిస్తున్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2023 ప్రకారం.. దేశంలోని టాప్ 20 కాలేజీలను జాబితాను విడుదల చేసింది.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

ఈ జాబితాలో 74.81 స్కోర్‌తో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మిరాండా హౌస్ దేశంలోనే టాప్ ర్యాంకింగ్ కాలేజీగా నిలిచింది. ఇక, రెండో స్థానంలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హిందూ కాలేజీ ఉండగా, చెన్నైకి చెందిన ప్రెసిడెన్సీ కాలేజీ మూడో స్థానంలో ఉంది. హిందూ కళాశాల 72.39 స్కోర్‌ను కలిగి ఉండగా, ప్రెసిడెన్సీ కళాశాల 72.39 సాధించింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024 ప్రకారం.. భారత్‌లో టాప్ 20 కాలేజీల జాబితా ఈ కింది విధంగా ఉన్నాయి.

  • మిరాండా హౌస్
  • హిందూ కళాశాల
  • ప్రెసిడెన్సీ కళాశాల
  • కృష్ణమ్మాళ్ కాలేజ్ ఫర్ ఉమెన్
  • సెయింట్ జేవియర్స్ కాలేజ్
  • ఆత్మ రామ్ సనాతన్ ధర్మ కళాశాల
  • లయోలా కళాశాల
  • రామ కృష్ణ మిషన్ వివేకానంద సెంటెనరీ కళాశాల
  • కిరోరి మాల్ కాలేజ్
  • లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్
  • శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్
  • హన్స్ రాజ్ కళాశాల
  • శ్రీవెంకటేశ్వర కళాశాల
  • సెయింట్ స్టీఫెన్స్ కళాశాల
  • రామకృష్ణ మిషన్ విద్యామందిర
  • మద్రాసు క్రిస్టియన్ కళాశాల
  • దేశబంధు కళాశాల
  • త్యాగరాజర్ కళాశాల
  • రామకృష్ణ మిషన్ రెసిడెన్షియల్ కళాశాల
  • పీఎస్‌జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్

2024కి సంబంధించి 10వ తరగతి పరీక్షల ఫలితాలను సీబీఎస్ఈ సోమవారం విడుదల చేయగా 93.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 94.75 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 2.04 శాతం పాయింట్లతో అధిగమించారు. 47వేల మంది విద్యార్థులు 95 శాతానికి మించి మార్కులు సాధించగా, 2 లక్షల మందికి పైగా 90 శాతానికి పైగా స్కోర్లు సాధించారు.

Read Also : CBSE Class 12 Results 2024 : సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి.. 99.15 శాతం ఉత్తీర్ణతతో టాప్ 3లో తెలంగాణ!

ట్రెండింగ్ వార్తలు