Aravind Sasikumar : లండన్‌లో భారత సంతతి వ్యక్తి కత్తితో పొడిచి దారుణ హత్య.. మూడు రోజుల్లో రెండో ఘటన

పోస్ట్‌మార్టం పరీక్షలో ఛాతీపై కత్తిపోటు కారణంగా శశికుమార్ మృతి చెందినట్లు ఈవినింగ్ స్టాండర్డ్ వార్తాపత్రిక తెలిపింది.

Aravind Sasikumar

Aravind Sasikumar Death : హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల మహిళను లండన్‌లోని ఆమె వసతి గృహంలో బ్రెజిలియన్ వ్యక్తి కత్తితో పొడిచి చంపిన రెండు రోజులకే లండన్‌లో భారత సంతతి వ్యక్తి కత్తితో పొడిచి చంపబడ్డాడు. శుక్రవారం లండన్‌లో భారత సంతతికి చెందిన వ్యక్తిని కత్తితో పొడిచి దారుణ హత్య గావించబడ్డాడు.

కాంబర్‌వెల్‌లోని రెసిడెన్షియల్ ప్రాపర్టీ సౌతాంప్టన్ వేలో భారత సంతతికి చెందిన 38 ఏళ్ల అరవింద్ శశికుమార్ కత్తి గాయాలతో కనిపించాడని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 1.31 గంటలకు బాధితుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

Army rescues tourists: ఉత్తర సిక్కింలో వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను కాపాడిన ఆర్మీ

శుక్రవారం నిర్వహించిన పోస్ట్‌మార్టం పరీక్షలో ఛాతీపై కత్తిపోటు కారణంగా శశికుమార్ మృతి చెందినట్లు ఈవినింగ్ స్టాండర్డ్ వార్తాపత్రిక తెలిపింది. మరణాన్ని “భయంకరమైన హత్య”గా కాంబెర్‌వెల్ మరియు పెక్‌హామ్‌ల ఎంపీ హ్యారియెట్ హర్మాన్ అభివర్ణించారు. అతని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మరుసటి రోజు శనివారం 25 ఏళ్ల సల్మాన్ సలీం హత్యకు పాల్పడ్డాడని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. అదే రోజున క్రోయ్‌డాన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుచగా అతనికి రిమాండ్ విధించారు. జూన్ 20న ఓల్డ్ బెయిలీలో అతన్ని హాజరుపరచనున్నారు.

Ravinder Gupta : తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తాకు 14 రోజులు రిమాండ్

బ్రిటీష్ ఇండియన్ టీన్ గ్రేస్ ఓ మల్లీ కుమార్(19), హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల తేజస్విని కొంతమ్ రెండు వేర్వేరు సంఘటనల్లో మరణించడంతో యూకేలో కలకలం రేపింది. జూన్ 14న ఉత్తర లండన్‌లోని వెంబ్లీలోని నీల్డ్ క్రెసెంట్‌లోని రెసిడెన్షియల్ ప్రాపర్టీలో తేజస్విని కొంతమ్ ను కత్తితో పొడిచి చంపారు.

ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అదే రోజున జరిగిన వేరొక సంఘటనలో తోటి స్నేహితురాలు బర్నాబీ వెబెర్ (19)తో కలిసి రాత్రి తిరిగి వస్తుండగా కుమార్ పై కత్తితో దాడి చేసి చంపారు.

ట్రెండింగ్ వార్తలు