Prison : జైల్లో ఖైదీల మధ్య గ్యాంగ్ వార్.. 68మంది మృతి

ఈక్వెడార్‌లోని ఓ జైల్లో ఖైదీల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 68 మంది చనిపోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Prison : ఈక్వెడార్‌లోని ఓ జైల్లో ఖైదీల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 68 మంది చనిపోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్వాయాక్విల్‌ నగరంలోని లిటోరల్ జైల్లో ఈ ఘటన జరిగింది. దాదాపు 900 మంది పోలీసులు 8 గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఖైదీల నుంచి పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. జైల్లోకి వెళ్లే సరకుల వాహనాలు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు ఖైదీలకు చేరినట్లు భావిస్తున్నారు.

మరోవైపు జైలు నుంచి భారీ పేలుడు శబ్దాలు రావడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. ఈక్వెడార్ లో జైళ్లలో ఘర్షణలు కామన్ గా మారాయి. రెండు నెలల క్రితం(సెప్టెంబర్ 29న) మరో జైల్లోనూ ఇదే తరహాలోనే ఘర్షణలు జరిగాయి. ఆ ఘటనలో 119 మంది ఖైదీలు మృతి చెందారు.

WhatsApp Feature: వాట్సప్‌లో కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్

జైల్లో భారీ ఎత్తున మరణాలు సంభవించడంతో ఖైదీల బంధువులు కారాగారం దగ్గర ఆందోళనకు దిగారు. తమవారు ప్రాణాలతో ఉన్నారో.. లేదో.. తెలపాలని జైలు అధికారులను నిలదీశారు. మరోవైపు జైల్లో జరిగిన మారణహోమానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండడం, కొన్నింటిని కాల్చివేయడం అందులో కనిపిస్తోంది.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాకు చెందిన రెండు వర్గాల మధ్య ఈ ఘర్షణలు తలెత్తినట్లు తెలుస్తోంది. గొడవల్లో భాగంగా దుండగులు గోడను డైనమైట్‌తో పేల్చేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు