Bengaluru: చెడు వ్యక్తులను మాత్రమే బాధ పెడతానని పోస్ట్ పెట్టి సీఈవో, మేనేజర్‭ను చంపేశాడు

వాట్సాప్ స్టేటస్‭లో "చెడు వ్యక్తులను" మాత్రమే బాధపెడతాడని రాయడం చూస్తుంటే.. పరిశ్రమ పద్ధతులపై ఫెలిక్స్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఫణీంద్ర గురించి ప్రస్తావించాడని అంటున్నారు. ఫెలిక్స్ కూడా ఫణీంద్ర లాంటి వ్యాపారాన్నే నడిపాడు

Karnataka: మంగళవారం బెంగళూరులోని ఓ టెక్‌ సంస్థ కార్యాలయంలోకి కత్తితో చొరబడి మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో)లను హత్య చేసిన శబరీష్‌ అలియాస్‌ ఫెలిక్స్‌ జంట హత్యకు ముందు వాట్సాప్‌లో పెట్టిన స్టేటస్ ఆసక్తికరంగా మారింది. ‘‘లోకమంతా చెడ్డవాళ్లు, మోసగాళ్లతో నిండిపోయింది. నేను చెడు వ్యక్తులను మాత్రమే ఇబ్బంది పెడతాను’’ అంటూ నిందితుడు ఫెలిక్స్ తన వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఇప్పుడిది బయటికి రావడంతో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

Heavy Rains: 80 మంది మృతి, 4 వేల కోట్ల ఆస్తి ధ్వంసం.. హిమాచల్ ప్రదేశ్‭లో భారీ వర్షాల నష్టమిది

గతంలో ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీలో పనిచేసిన ఫెలిక్స్‌కు ఎండీ ఫణీంద్ర సుబ్రమణ్య, సీఈవో వినుకుమార్‌తో వైరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జూలై 11న సాయంత్రం 4 గంటలకు కత్తితో టెక్ సంస్థలోకి ప్రవేశించిన అతడు.. ఫణీంద్ర, వినుకుమార్‌లను కత్తితో పొడిచి పారిపోయాడు.

Mirzapur : గుడ్డు భాయ్ వచ్చేస్తున్నాడు.. మీర్జాపూర్ సీజన్ 3 అప్డేట్ ఇచ్చిన బీనా ఆంటీ..

ఇక వైరల్ అవుతున్న వాట్సాప్ స్టేటస్‭లో “చెడు వ్యక్తులను” మాత్రమే బాధపెడతాడని రాయడం చూస్తుంటే.. పరిశ్రమ పద్ధతులపై ఫెలిక్స్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన ఫణీంద్ర గురించి ప్రస్తావించాడని అంటున్నారు. ఫెలిక్స్ కూడా ఫణీంద్ర లాంటి వ్యాపారాన్నే నడిపాడు. ఇప్పుడు హత్యకు గురైన వ్యక్తులు ఫెలిక్స్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నట్లు బలంగా వాదనలు వస్తున్నాయి.

Mumbai Court : భార్యతో పాటు ఆమె కుక్కలకు కూడా భరణం ఇవ్వాల్సిందే : కోర్టు కీలక తీర్పు

“ఎప్పుడూ పొగిడేవాళ్ళు, మోసం చేసేవారితో ప్రపంచం నిండిపోయింది. అందుకే నేను ఈ ప్రజలను బాధించాను. నేను చెడ్డ వ్యక్తులను మాత్రమే బాధించాను. నేను మంచి వ్యక్తులను ఎప్పుడూ బాధించలేదు” అని హత్యకు ముందు ఫెలిక్స్ తన వాట్సాప్ స్టేటస్ షేర్ చేశాడు. ఫెలిక్స్ సహా అతని ఇద్దరు సహచరులు వినయ్ రెడ్డి, సంతోష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు