Woman Shower Filming : మహిళా పోలీసు అధికారి బాత్రూం వీడియో…రూ. 5 లక్షలకు బేరం పెట్టిన డ్రైవర్

ఎంతైనా పోలీసోళ్లకున్న ధైర్యమే వేరబ్బా... ఏకంగా మహిళా పోలీసు అధికారిణి బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియోను షూట్ చేశాడు ఆమె దగ్గర పనిచేసే డ్రైవర్.

Woman Shower Filming :  ఎంతైనా పోలీసోళ్లకున్న ధైర్యమే వేరబ్బా… ఏకంగా మహిళా పోలీసు అధికారిణి బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియోను షూట్ చేశాడు ఆమె దగ్గర పనిచేసే డ్రైవర్. ఈవిషయం బయట పడటంతో వీడియోలు ఇవ్వాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.  కాదనే సరికి పోలీసు అధికారులు దాడి చేసారని ఉన్నతాధికారులపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి పరారైనన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

భోపాల్ లోని ఓ పోలీసు అధికారిణికి  డ్రైవర్ గా ఓ కానిస్టేబుల్ కొన్నాళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 22వ తేదీన  ఆమె ఇంట్లోకి ప్రవేశించి  పోలీస్ అధికారిణి బాత్రూంలో స్నానం చేస్తుండగా తలుపు  పైనుంచి సెల్ ఫోన్ ద్వారా వీడియో తీయటానికి ప్రయత్నించాడు.  ఈ విషయం గమనించిన ఆమె వెంటనే బాత్రూంలోంచి బయటకు వచ్చేసి చూడగా కానిస్టేబుల్ పారిపోతూ కనిపించాడు. కంగుతిన్న ఆమె షాక్ కు గురయ్యింది.
Also Read : Fake Currency : దొంగనోట్ల ముఠాను పట్టిచ్చిన చికెన్ పకోడీ
అనంతరం  నాలుగు రోజుల తర్వాత ఆమె ఇంటికి వచ్చిన డ్రైవర్ బెదిరించాడు. మీరు స్నానం చేస్తున్న వీడియోలు నాదగ్గర ఇంకా ఉన్నాయి. నాకు రూ. 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మీరు డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు. అతని బెదిరింపులకు లొంగని పోలీసు అధికారిణి ఈవిషయమై భోపాల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా నిందితుడు శనివారం హబీబ్ గంజ్ పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. చార్ ఇమ్లీలోని పోలీసు  అధికారిణి నివాసంలో తనపై సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) రామ్జీ శ్రీవాస్తవ, ‍క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు