Bihar: బిహార్‌లో నిలిచిపోయిన వాట్సాప్, ఫేస్‌బుక్ సేవలు.. యువకుడి హత్య, ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసుల నిర్ణయం

బిహార్, సారణ్ జిల్లా ముబారక్‌పూర్‌లో గ్రామ పెద్దల్లో ఒకడైన విజయ్ యాదవ్‌పై ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో అమితేష్ కుమార్, అతడి ఇద్దరు స్నేహితులే తనపై కాల్పులు జరిపి ఉంటారని విజయ్ యాదవ్ భావించాడు.

Bihar: బిహార్‌లోని సారణ్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఒక యువకుడి హత్యతో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో అనేక ఇండ్లను ఆందోళనకారులు దహనం చేశారు. విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు స్పందించి 144 సెక్షన్
విధించారు. జిల్లా వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి పలు యాప్స్ సేవలను నిషేధించారు.

Turkiye Earthquake: భూకంప శిథిలాల కింద చిక్కుకున్న యువతి.. ఎలా బయటపడిందో చూడండి.. వీడియో వైరల్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారణ్ జిల్లా ముబారక్‌పూర్‌లో గ్రామ పెద్దల్లో ఒకడైన విజయ్ యాదవ్‌పై ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో అమితేష్ కుమార్, అతడి ఇద్దరు స్నేహితులే తనపై కాల్పులు జరిపి ఉంటారని విజయ్ యాదవ్ భావించాడు. దీంతో అమితేష్, ఇద్దరు స్నేహితులపై విజయ్ యాదవ్, అతడి అనుచరులు కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో అమితేష్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మిగతా ఇద్దరూ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. అమితేష్హత్యతో అతడి సన్నిహితులు, బంధువుల్లో ఆగ్రహం పెల్లుబికింది.

Turkey Earthquake : టర్కీలో మళ్లీ భారీ భూకంపం.. గంటల వ్యవధిలో రెండోసారి

నిందితుడు విజయ్ యాదవ్, అతడి అనుచరుల ఇండ్లపై వాళ్లంతా దాడి చేశారు. మొత్తం 12కుపైగా ఇండ్లను ఇండ్లను తగలబెట్టారు. చుట్టుపక్కల ప్రదేశాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. అయితే, ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు స్పందించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు 144 సెక్షన్ విధించారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇండ్లకు అంటుకున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మొదలుకావడంతో పోలీసులు ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి యాప్స్‌ను పూర్తిగా నిషేధించారు.

23 సోషల్ మీడియా యాప్స్‌ను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. అసత్య ప్రచారం జరిగి ఉద్రిక్తతలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే 144 సెక్షన్ విధించి, యాప్స్ నిషేధించారు. ఫిబ్రవరి 8 రాత్రి 11 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఐదుగురు ప్రధాన నిందితులతోపాటు, మరో 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు