Chandini Chowdary : ఆడపిల్లనే ఐతే ఏంటి..? పోలీసాఫీసర్‌గా చాందిని చౌదరి..
యేవమ్ సినిమాతో కూడా చాందిని మరో కొత్త కథ, పాత్రతో రాబోతుందని తెలుస్తుంది.
- Saketh U
- Published On : April 26, 2024 / 03:37 PM IST
Chandini Chowdary turned as Police Officer for Lady Oriented Yevam Movie
Chandini Chowdary : తెలుగమ్మాయి చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లు వరుసగా చేస్తుంది. అయితే చాందిని ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలలో నటిస్తుంది. సినిమాలో కమర్షియాలిటీ లేకపోయినా కంటెంట్ తో పాటు తన పాత్రకు ఉన్న గుర్తింపు చూస్తుంది. అలాంటి పాత్రలతో వరుస హిట్స్ కొడుతుంది చాందిని చౌదరి. ఇటీవలే ‘గామి'(Gaami) సినిమాలో లైఫ్ రిస్క్ చేసి మరీ నటించి హిట్ కొట్టి అందరి ప్రశంశలు పొందింది.
త్వరలో మ్యూజిక్ షాప్ మూర్తి అనే మరో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది. అలాగే చాందిని ఫిమేల్ ఓరియెంటెడ్ గా ‘యేవమ్’ అనే సినిమాని కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. తాజాగా యేవమ్ సినిమా నుంచి చాందిని చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చాందిని పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది. ఫస్ట్ లుక్ లో పోలీస్ యూనిఫార్మ్ తో సిన్సియర్ పోలీసాఫీసర్ గా కనిపించింది. చాందిని PSI సౌమ్యగా, వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈ యేవమ్ కథ జరగనున్నట్టు తెలుస్తుంది. ఇక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆడపిల్లనే ఐతే ఏంటట? అని ప్రశ్నిస్తుంది చాందిని.
Also Read : Samantha : పెళ్లి గౌనుని ఇన్నాళ్లు భద్రంగా దాచుకొని.. కొత్త జ్ఞాపకం అంటూ.. రీ మోడల్ చేయించిన సమంత..
దీంతో ఈ యేవమ్ సినిమాతో కూడా చాందిని మరో కొత్త కథ, పాత్రతో రాబోతుందని తెలుస్తుంది. యేవమ్ సినిమా ఈ సంవత్సరమే రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా హిట్ అయి చాందిని పాత్రకు ఎప్పటిలాగే మంచి ప్రశంసలు వస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో నవదీప్ కూడా భాగమవ్వడం విశేషం. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వశిష్ట సింహా, జై భారత్, అషురెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
