Samantha : పెళ్లి గౌనుని ఇన్నాళ్లు భద్రంగా దాచుకొని.. కొత్త జ్ఞాపకం అంటూ.. రీ మోడల్ చేయించిన సమంత..

తాజాగా సమంత తన పెళ్లి గౌనుని బయటకి తీసి ఓ అవార్డు ఫంక్షన్ కోసం రీ మోడల్ చేయించి వేసుకుంది.

Samantha : పెళ్లి గౌనుని ఇన్నాళ్లు భద్రంగా దాచుకొని.. కొత్త జ్ఞాపకం అంటూ.. రీ మోడల్ చేయించిన సమంత..

Samantha Remodeling her Wedding Gown Photos and Video goes Viral

Samantha : సమంత నాగ చైతన్యతో మూడేళ్ల క్రితం విడిపోయినా రోజూ ఎక్కడో ఒకచోట ఈ జంట గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. సమంత పెళ్లి హిందూ – క్రిస్టియన్ పద్ధతుల్లో జరిగిన సంగతి తెలిసిందే. క్రిస్టియన్ పద్దతిలో జరిగినపుడు సమంత ఓ స్పెషల్ వైట్ కలర్ గౌనుని డిజైన్ చేయించి వేసుకుంది. అప్పట్లో సమంత పెళ్లి గౌను బాగా వైరల్ అయింది. అయితే సమంత ఇన్నాళ్లు ఆ పెళ్లి గౌను భద్రంగా దాచుకుంది.

తాజాగా సమంత తన పెళ్లి గౌనుని బయటకి తీసి ఓ అవార్డు ఫంక్షన్ కోసం రీ మోడల్ చేయించి వేసుకుంది. సమంత తన వైట్ కలర్ పెళ్లి గౌనుని బ్లాక్ కలర్ కి మార్చి కొత్తగా డిజైన్ చేయించి దానికి సంబంధిచిన వీడియో, కొత్త డ్రెస్ వేసుకొని దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత డ్రెస్ ని క్రేశ బజాజ్ అనే సంస్థ రీ మోడలింగ్ చేసింది. సమంతతో కలిసి పెళ్లి గౌనుని రీమోడలింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసి.. కొత్త జ్ఞాపకాలు, నడవడానికి కొత్త దారులు, చెప్పడానికి కొత్త కథలు ఎప్పుడూ ఉంటాయి. సమంతతో కలిసి పనిచేయడం చాలా బాగుంది. ఆమెకు ఒక కొత్త జ్ఞాపకాన్ని సృష్టించాము అని పోస్ట్ చేశారు.

Also Read : Rathnam Review : ‘రత్నం’ మూవీ రివ్యూ.. అమ్మలాంటి అమ్మాయి కోసం పోరాటం..

ఇక సమంత తన రీ మోడల్ డ్రెస్ ని ధరించి దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ..నాకు ఇష్టమైన గౌనుని నేను రీ మోడలింగ్ చేయించాను. నా అలవాట్లు, నా జీవన శైలి మార్చుకున్నట్టే నా పాత బట్టలను కూడా మళ్ళీ తిరిగి కొత్త రూపం తీసుకువస్తున్నాను. ప్రతి నిర్ణయం, ప్రతి పని ముఖ్యమైనదే. నాకు మీ హృదయాల్లో ప్రతీక స్థానం ఇచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు అని పోస్ట్ చేసింది. దీంతో సమంత కొత్త రీమోడలింగ్ డ్రెస్ వైరల్ గా మారింది.