Tollywood Actress : ఈ క్యూట్ పాపని గుర్తు పట్టారా? వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న పాప ఏ హీరోయిన్ గుర్తుపట్టారా?

Tollywood Actress : చిన్నప్పుడు అందరూ క్యూట్ గానే ఉంటారు. మరి ఇప్పుడు హీరోయిన్ గా ఉన్నారంటే చిన్నప్పుడు ఇంకెంత క్యూట్ గా ఉండాలి. తాజాగా ఓ హీరోయిన్ చిన్నప్పటి ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో కోటు ధరించి క్యూట్ గా ఉంది ఆ హీరోయిన్. మరో ఫొటోలో పక్కనే ఇంకో పాపతో మాట్లాడేస్తుంది. ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న పాప ఏ హీరోయిన్ గుర్తుపట్టారా?

ఇంకెవరు ప్రస్తుతం తెలుగులో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సంయుక్త. మలయాళీ భామ సంయుక్త 2016లో మలయాళంలో పాప్ కార్న్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరుసగా మలయాళం, తమిళ్ లో సినిమాలు చేసింది. తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా సంయుక్త మొదటి సినిమాతో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో బింబిసార, సర్, విరూపాక్ష, డెవిల్.. ఇలా వరుసగా తెలుగులో హిట్స్ కొట్టింది సంయుక్త.

Also Read : Chandini Chowdary : ఆడపిల్లనే ఐతే ఏంటి..? పోలీసాఫీసర్‌గా చాందిని చౌదరి..

తెలుగులో వరుస విజయాలు రావడంతో టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి ఈ కేరళ కుట్టికి. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు కూడా కష్టపడి నేర్చుకుంటుంది. అలాగే మరో రెండు తెలుగు సినిమాలు సంయుక్త చేతిలో ఉన్నాయని సమాచారం. ఇటీవలే మహిళల కోసం ఆదిశక్తి అనే ఓ ఫౌండేషన్ ని కూడా స్దాపించింది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇలా సంయుక్త చిన్నప్పటి ఫొటోలు బయటకి రావడంతో మరోసారి సంయుక్త వైరల్ అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు