Mumbai Model : 50 మంది పురుషులపై కిలాడీ ముంబయి మోడల్ వలపు వల

ముంబయికు చెందిన కిలాడీ మోడల్ 50 మంది పురుషులపై వలపన్ని వారి నుంచి రూ.35లక్షలు వసూలు చేసిన బాగోతాన్ని బెంగళూరు పోలీసులు బట్టబయలు చేశారు. ముంబయి నగరానికి చెందిన నేహా అలియాస్ మెహర్ అనే మోడల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌లో పురుషులతో కనెక్ట్ అయి వారిని నిలువునా ముంచింది.....

Mumbai Model

Mumbai Model : ముంబయికు చెందిన కిలాడీ మోడల్ 50 మంది పురుషులపై వలపన్ని వారి నుంచి రూ.35లక్షలు వసూలు చేసిన బాగోతాన్ని బెంగళూరు పోలీసులు బట్టబయలు చేశారు. ముంబయి నగరానికి చెందిన నేహా అలియాస్ మెహర్ అనే మోడల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్‌లో పురుషులతో కనెక్ట్ అయి వారిని నిలువునా ముంచింది. (model lured over 50 men) తన భర్త దుబాయ్‌లో పనిచేస్తున్నాడని, లైంగిక సంబంధాలు పెట్టుకునేందుకు తాను సుముఖంగా ఉన్నానని ఆ మహిళ తెలిపింది.

Air Hostess : స్పైస్ జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్‌పై ప్రయాణికుడి వేధింపులు

మోడల్ తన ఫొటోలు, చిరునామాను కూడా పురుషులతో పంచుకుంది. మోడల్ లైంగిక కార్యకలాపాల కోసం పురుషులను తన నివాసానికి రప్పించి, లైంగిక కార్యకలాపాల వీడియోను రికార్డ్ చేసింది. అనంతరం బాధితులను బెదిరించడానికి ఈ వీడియోను ఉపయోగించింది. (extorted Rs.35 lakh from them over videos) ఈ సెక్స్‌టార్షన్ రాకెట్‌ను ఇటీవల కర్ణాటక పోలీసులు ఛేదించారు. ఈ ముంబయి మోడల్ ఆధ్వర్యంలోని ముఠా 50 మందికి పైగా లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Imran Khan Wife : పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ సంచలన లేఖ

బాధితుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ మొత్తం వెలుగులోకి వచ్చింది. మార్చి 3వతేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు తాను మెహర్ నివాసానికి వెళ్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి అక్కడ ఎందుకు ఉన్నావని ప్రశ్నించారని ఆరోపించారు. అనంతరం అతనిపై దాడికి దిగారు. రాకెట్‌కు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రూ.3 లక్షలు ఇవ్వకుంటే తన బట్టలు విప్పి వీధుల్లో ఊరేగించి మసీదుకు తీసుకువెళ్లి సున్తీ చేయించి మెహర్‌తో పెళ్లి చేస్తామని ముఠా బెదిరించిందని బాధితుడు పేర్కొన్నారు.

Amarnath Yatra : లోయలో పడి అమరనాథ్ యాత్రికుడి మృతి

ఫోన్‌పే పేమెంట్ అప్లికేషన్ ద్వారా మొబైల్ నంబర్‌కు రూ.21,500 బదిలీ చేశానని బాధితుడు చెప్పారు. రాత్రి 8 గంటల వరకు తనను ముఠా బందీగా ఉంచిందని, క్రెడిట్ కార్డ్ లావాదేవీ ద్వారా నిందితులు అదనంగా 2.5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని పోలీసులకు చెప్పారు. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో కీలకమైన ముంబయి మోడల్ మెహర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు