ఇష్టం లేని పెళ్లి చేశారని దారుణం..! వదిన, ఆమె ఇద్దరు పిల్లలను చంపి మరిది ఆత్మహత్య
ఈ క్రమంలో అన్న దాసు ఇంట్లో లేని సమయంలో అతడు దారుణానికి ఒడిగట్టాడు.
- Naveen
- Published On : July 25, 2024 / 01:16 AM IST
Tirupati Incident (Photo Credit : Google)
Tirupati Incident : తిరుపతిలోని పద్మావతి నగర్ లో దారుణం జరిగింది. వదినతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను చంపేశాడు మరిది. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందారు. ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు మోహన్. మృతులను సునీత, దేవిశ్రీ, నీరజగా గుర్తించారు. అన్నదమ్ముల మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు మోహన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితమే అతడికి వివాహం జరిగింది. అయితే, ఈ పెళ్లి అతడికి ఇష్టం లేదు.
అన్న, వదినలే తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని గత కొద్ది రోజులుగా మోహన్ ఆగ్రహంగా ఉన్నాడు. ఈ క్రమంలో అన్న దాసు ఇంట్లో లేని సమయంలో అతడు దారుణానికి ఒడిగట్టాడు. వదినను, ఆమె పిల్లలను కడతేర్చాడు. కాగా, తన తమ్ముడు మోహన్ మానసిక స్థితి సరిగా లేదని, ఇష్టం లేని పెళ్లి చేశామంటూ తమపై కోపం పెంచుకున్నాడని అన్న దాసు తెలిపాడు.
ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతో మోహన్ ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అందరినీ షాక్ కి గురి చేసింది. పిల్లలు ఏం పాపం చేశారు? అని బోరున విలపించారు. తల్లి, పిల్లల మృతితో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Also Read : స్పైడర్‌మ్యాన్ గెటప్‌లో కారుతో డేంజర్ ఫీట్స్.. ఆట కట్టించిన హస్తిన పోలీసులు
