గంజాయితో యువతి జీవితాన్ని నాశనం చేసి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి.. ఖతర్నాక్ కిలాడీలు

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు భార్యభర్తలు మామూలు కిలాడీలు కాదు. సంప్రదాయబద్దంగా కనిపిస్తున్న ఈమె అయితే ఇంకా మహా ముదురు.

Tirupati wife and husband arrested after blackmailed woman Law student

Tirupati Law student case: ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు భార్యభర్తలు మామూలు కిలాడీలు కాదు. భర్త పక్కన సంప్రదాయబద్దంగా కనిపిస్తున్న ఈమె అయితే ఇంకా మహా ముదురు. న్యాయవిద్య అభ్యసిస్తూ భర్తతో కలిసి నికృష్టమైన పనిచేసి పోలీసులకు దొరికిపోయింది. నమ్మివచ్చిన తోటి విద్యార్థిని జీవితాన్ని నాశనం చేసి జైలులో ఊచలు లెక్కిస్తున్నారు ఈ మహాముదుర్లు. సమాజంలో పతనమైపోతున్న విలువలకు నిలువెత్తున్న నిదర్శనంగా నిలిచారు ఈ డర్టీ దంపతులు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న దుర్మార్గుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వీరిద్దరూ మరోసారి ప్రపంచానికి చాటారు.

అసలేం జరిగింది?
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి రూరల్ మండలం పుదిపట్లకు చెందిన కృష్ణకిశోర్‌రెడ్డి, ప్రణవకృష్ణ భార్యభర్తలు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రణవకృష్ణ ఎల్ఎల్‌బీ చదువుతోంది. తనతో పాటు చదువుతున్న కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి(22)తో ప్రణవకృష్ణ పరిచయం పెంచుకుంది. పుదిపట్లలోని తన ఇంటికి తీసుకెళ్లి భర్తకు పరిచయం చేయడంతో పాటు, గంజాయి సేవించడం కూడా అలవాటు చేసింది. మత్తులో ఉన్న యువతిపై కృష్ణకిశోర్‌రెడ్డి అనైతిక చర్యలకు పాల్పడేవాడు. ఇదంతా దగ్గరుండీ మరీ ప్రణవకృష్ణ ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేసింది.

బాధిత యువతికి పెళ్లి కుదరడంతో కృష్ణకిశోర్‌, ప్రణవకృష్ణ దంపతులు బ్లాక్‌మెయిల్‌కు తెరతీశారు. తమదగ్గరున్న ఫొటోలు, వీడియోలు బయటపెడతామంటూ విద్యార్థిని దగ్గర నుంచి డబ్బు గుంజారు. అక్కడితో ఆగకుండా బాధితురాలి గోల్డ్ చైన్, ఎంగేజ్‌మెంట్ రింగ్‌ కూడా లాక్కున్నాయి. పదేపదే డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధిత విద్యార్థిని సతమతమయింది. మానసికంగా నగిలిపోయింది. వేధింపులు భరించలేక ప్రాణాలు తీసుకోవాలని భావించింది. అయితే, ఈ నెల 23న సొంతూరు నుంచి ఆమె తల్లి తిరుపతికి వచ్చింది.

Also Read : తిరుపతిలో దారుణం.. వదిన, ఆమె ఇద్దరు పిల్లలను చంపి మరిది ఆత్మహత్య

కూతురు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న విషయాన్ని గమనించిన తల్లి.. ఏం జరిగిందని ఆరా తీయడంతో బాధితురాలు భోరుమంది. తాను మోసపోయిన విషయాన్ని చెప్పడంతో.. కూతురుతో కలిసి ఆమె తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కృష్ణకిశోర్‌, ప్రణవకృష్ణ దంపతులను అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని తిరుపతి రూరల్ సీఐ తమీమ్ అహ్మద్ తెలిపారు. మరోవైపు తోటి విద్యార్థిని జీవితంతో ఆడుకున్న ప్రణవకృష్ణను పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు.

Also Read : విలన్‌గా వెళ్లి కమెడీయన్‌గా బయటకు.. సీసీ కెమెరా ముందు వైరటీ దొంగ కామెడీ ఫర్ఫామెన్స్!

ట్రెండింగ్ వార్తలు