చోరీ కోసం వచ్చిన దొంగకు నిరాశ.. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందని సీసీ కెమెరా ముందు ఏడుపు

పక్కా స్కెచ్‌ వేసి అర్థరాత్రి హోటల్‌లోకి దూరాడు. సీరియస్‌గా తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన ఆ దొంగకు నిరాశ ఎదురైంది.

చోరీ కోసం వచ్చిన దొంగకు నిరాశ.. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందని సీసీ కెమెరా ముందు ఏడుపు

thief attempt to rob hotel make fun with cctv camera video viral in maheshwaram

Thief Viral Video: బడా హోటల్.. మిరుమిట్లు గొలిపే లైట్లు.. ఇంకేముంది.. అబ్బ ఈ రోజు పంట పండింది అనుకున్నాడు. లోపల సొమ్ము బాగానే ఉంటుందని భావించాడు. పక్కా స్కెచ్‌తో అర్థరాత్రి దొంగతనానికి వెళ్లాడు. ఎలాంటి క్లూలు దొరక్కూడదని చేతులకు గ్లౌజులు. ముఖానికి మంకీ క్యాప్ ధరించి హోటల్‌ లోపలికి అడుగుపెట్టాడు. ఎంతో ఆశతో.. మరెంతో ఉత్సాహంతో హోటల్లోకి వెళ్లిన దొంగ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టాడులే ఈ వెరైటీ దొంగ. పాపం.. బయటి రంగులు.. హోటల్ తీరుతెన్నులు చూసి.. అబ్బ పంట పండింది అనుకున్నాడో దొంగ. పక్కా స్కెచ్‌ వేసి అర్థరాత్రి హోటల్‌లోకి దూరాడు. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కూడదని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ వేసి చేతులకు గ్లౌజ్లు, ముఖానికి మంకీక్యాప్ ధరించాడు. సీరియస్‌గా తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన ఆ దొంగకు నిరాశ ఎదురైంది.

వాయిస్-రంగారెడ్ది జిల్లా మహేశ్వరంలోని ఓ హోటల్లోకి అర్థరాత్రి దొంగ దూరాడు. గంపెడు ఆశలతో లోపలికి వెళ్లిన దొంగ.. ముందుగా కౌంటర్‌లో వెతికాడు. ఒక్కరూపాయి దొరకలేదు. హోటల్‌లోని ఒక్కో ప్లేస్‌ను జల్లెడ పట్టాడు. అయినా ఒక్కరూపాయి కూడా దొరకలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన చోరీగాడు.. సీసీ కెమెరా ముందు తన గోడును వెళ్లబోసుకున్నాడు. దూకుడు సినిమాలో బ్రహ్మానందం కెమెరా ముందు రిక్వెస్ట్ చేసుకున్నట్లుగా హోటల్ యజమానికి ఓ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు.

హోటల్ అన్నప్పుడు పదో.. పరుకో పెట్టుకోపోతే ఎలా బతకాలి అంటూ సీసీ కెమెరా ముందు సైగలు చేశాడు. ఒక్కరూపాయి పెట్టకపోతే దొంగలు ఎలా బ్రతకేదని అన్నట్లు వేడుకున్నాడు.

ఆ తర్వాత మళ్లీ అటు ఇటు వెతకసాగాడు. ఏమీ దొరకకపోవడంతో ఫ్రిడ్జ్ డోర్‌ తీశాడు. అక్కడా కూడా ఏమీలేదు. అయితే ఫ్రీడ్జ్ లో నుంచి వాటర్ బాటిల్ దొంగిలించి బయటకు వెళ్లసాగాడు. రెండు అడుగులు వేశాక.. మళ్లీ వెనక్కు వచ్చాడు. తన పర్సులో నుంచి 20 రూపాయల నోటును తీసి టేబుల్‌పై పెట్టి పండగ చేస్కో అన్నట్లు సీసీ కెమెరా ముందు చెప్పేసి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.

Also Read : ‘గ్రాండ్‌పా గ్యాంగ్’ వస్తోంది.. తాళం వేసిన ఇళ్లే తాతల ముఠా టార్గెట్.. జర పైలం!

తర్వాతి రోజు హోటల్‌ను ఓపెన్‌ చేసిన యజమాని.. అనుమానం వచ్చి సీసీకెమెరా విజువల్స్ ను చూశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తేరుకుని..దొంగ చేసిన కామెడీకి కొద్దిసేపు నవ్వుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తానికి ఈ ఘటనలో దొంగ చేసిన కామెడీ ఫర్ఫామెన్స్.. బ్రహ్మానందం, అలీలను గుర్తుకు తెచ్చింది. ఈ పుటేజీని చూసిన వాళ్లంతా దొంగ చేష్టలు చూసి తెగనవ్వుకుంటున్నారు.

Also Read : న్యాయం కావాలంటూ వచ్చేవారికి అన్యాయమే..! అక్రమార్కులు, చీకటి వ్యవహారాలకు సహకరిస్తున్న పోలీస్‌ అధికారి..!