Hyderabad : అక్బరుద్దీన్ కేసు తీర్పు రేపటికి వాయిదా

దశాబ్ద కాలపు నాటి  అక్బరుద్దిన్ ఒవైసీ కేసులో తుది తీర్పును వెల్లడించనుంది నాంపల్లి స్పెషల్ కోర్టు.  2012లో  నిజామాబాద్ నిర్మల్ బహిరంగ సభలో విద్వేష పూరకమైన ప్రసంగాలు చేశారనే

Hyderabad : దశాబ్ద కాలపు నాటి  అక్బరుద్దిన్ ఒవైసీ కేసులో తుది తీర్పును వెల్లడించనుంది నాంపల్లి స్పెషల్ కోర్టు.  2012లో  నిజామాబాద్ నిర్మల్ బహిరంగ సభలో విద్వేష పూరకమైన ప్రసంగాలు చేశారనే అభియోగలపై కేసులు నమోదు అయ్యాయి. సీఐడీ  దర్యాప్తు జరిపింది 30 మంది సాక్షులు వీడియో ,ఆడియో టేపుల  ఫోరెన్సిక్ ల్యాబ్   నివేదికలతో చార్జీ షీట్ దాఖలు చేసింది సీఐడీ.   10 సంవత్సరాల అనంతరం ఈ కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

2012  నిజామాబాద్ నిర్మల్  లో జరిగిన బహిరంగ సభల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారనే ఆరోపణల పై ఎంఐఎం పార్టీ  ఎమ్మెల్యే  అక్బరుద్దీన్ ఓవైసీ పై పలు సెక్షన్ ల కింద కేసులు నమోద్ చేశారు పోలీసులు. సభలో అక్బర్ చేసిన హేట్ స్పీచ్ కు సంభందించిన ఆడియో వీడియో టేప్ ల ఆధారాలతో నిర్మల్  పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. నిర్మల్, ఆదిలాబాద్ ,కాకుండా దేశ వ్యాప్తంగా అక్బర్ చేసిన స్పీచ్ పై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.

ఆ రోజు అక్బరుద్దీన్ చేసిన ప్రసంగపై ఐపీసీ 120- బీ, 153 ఏ, 295, 298, 188 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో అరెస్టయిన అక్బర్ 40 రోజుల పాటు నిజామాబాద్  జైల్లో శిక్ష అనుభవించి బెయిల్ పై బయట కి వచ్చారు. ఆనాటి నుండి మొన్నటి దాకా సుదీర్ఘంగా ప్రజాప్రతినిధులు కోర్టులో విచారణ జరిగింది. నిర్మల్ సభలోనే కాకుండా ఆదిలాబాద్‌లో హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అక్బరుద్దీన్ పై కేసులు నమోదు అయ్యాయి.

విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు కోర్టు లో సుదీర్ఘంగా కొనసాగాయి. అక్బర్ తరుపు న్యాయవాదులు చాలా అంశాలు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అక్బర్ హెల్త్ కండిషన్ దృష్టిలో ఉంచుకుని తీర్పును వెల్లడించాలని కోర్టును కోరారు అడ్వకేట్స్.   అక్బర్ పై హత్యాయత్నం జరిగింది. శరీరం లో బుల్లెట్ గాయాలు ఉన్నాయి.  ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తమ క్లైంట్ అనేక సేవ కార్యక్రమాలు చేశాడు.   ఉచిత విద్యా, వైద్యం పేద ప్రజల కోసం అందిస్తున్నాడు. ఇంకా మరెన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న  వ్యక్తి పై ఆరోపణలు చెయ్యడం సరికాదని డిఫెన్స్ న్యాయవాదులు వాదించారు.

ఈ కేసులో సీఐడీ  అధికారులు దాఖలు చేసిన చార్జీ షీట్ లో అనేక అంశాలు పేర్కొన్నారు. అక్బర్‌కు శిక్ష పడేలా బలమైన వాదనలు వినిపించిన సీఐడీ  , 30 మంది సాక్షుల వాగ్మూలంలో పలువురు గెజిటెడ్ అధికారులను సాక్షులుగా కేసులో చేర్చారు అధికారులు.  ఇక సభలో ప్రసంగించిన ఆడియో, వీడియో, టీవీ  ఛానళ్ల క్లిపింగ్ లను సెంట్రల్ ఫోరెన్సిక్, లబోరేటరీ కి పంపించిన ఆధారాలను  కోర్ట్ కు సమర్పించారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన అక్బర్ ను కఠినంగా శిక్షించాలని కోరారు సీఐడీ  తరుపు న్యాయవాదులు.  తొమ్మిదేళ్ళ పాటు సుదీర్ఘంగా కొనసాగిన కేసులో రేపు నాంపల్లి ప్రజాప్రతినిధులు కోర్టు తీర్పు వెలువరించనుంది….తీర్పు నేపథ్యంలో పోలీసులు సైతం అలర్ట్ అయ్యారు..ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read : Ambati Rambabu : వైసీపీలో అసంతృప్తి టీ కప్పులో తుపాను-అంబటి రాంబాబు

 

ట్రెండింగ్ వార్తలు