Family End lives: చూడమని ఇచ్చిన బిడ్డను మాయం చేసింది… కుటుంబం ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు

కోలార్ పట్టణంలో కుటుంబం అంతా ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు తెలిసాయి. తీగలాగితే డొంక కదిలింది అన్నట్లుగా..పెళ్లికాకుండా తల్లి అయిన విద్యార్ధిని, ఆ బిడ్డను మాయం చేసిన మరో యువతి..

Karnataka Family Suicide: కర్ణాటకలోని కోలార్ పట్టణంలో ఐదుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. తీగలాగితే డొంక కదిలింది అన్నట్లుగా..ఓ పక్క పెళ్లికాకుండా తల్లి అయిన నర్శింగ్ విద్యార్థి చేసిన ఘన కార్యం..మరోపక్క చూస్తుండమని బిడ్డను ఇస్తే మాయం చేసిన మరో ఘటన బయటపడ్డాయి. దీంతో కుటుంబ పరువు పోయిందని ఐదుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని తేలిన ఘటన కర్ణాటకలోని కోలార్ పట్టణంలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని కోలార్ పట్టణంలో సోమవారం (నవంబర్ 8,2021) ఓ కుటుంబంలోని ఐగుగురు విషం తాగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఐదుగురిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు మునియప్ప (75), నారాయణమ్మ (70), బాబు (45), గంగోత్రి (17), పుష్ప (33) లు ఐదుగురు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారంతా ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఏంటీ? అనే కోణంలో విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

Read more :  Love Tragedy : మూడేళ్ల ప్రేమాయణం….ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

ఈ కేసు గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోసూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని.. కోలార్ పట్టణానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. కలిసి తిరిగేవారు. అలా ఇద్దరు సహజీవనం చేసిన ఫలితంగా ఆ యువతి గర్భవతి అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పలేదు. సెలవులకు కూడా ఇంటికి వెళ్లేది కాదు. దీంతో ఆమె తండ్రి.. చాలాసార్లు ఇంటికి రావాలంటూ ఫోన్ చేసినా.. ఏదో సాకు చెప్పి వెళ్లేది కాదు. అలా నెలలు నిండాయి ఆమెకు. ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

బిడ్డ పుట్టాక ఇక దాచలేను అనుకుందో ఏమోగానీ ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది.దీంతో ఆందోళన పడిన తల్లి కోలార్ లో ఉంటున్న కూతురు వద్దకు వచ్చింది. ఇక కోప్పడినా..ఏం చేసినా చేసేది ఏమీ లేదనుకుంది. కూతుర్ని..మనుమరాలినితో కొన్ని రోజులు గడిపింది. ఇక ఊరు వెళతానంటు బయలుదేరింది. కానీ ఆ యువతి తల్లి తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. బిడ్డను తీసుకెళితే ఇంట్లో గొడవ జరుగుతుందని అనుకుని..నిదానంగా ఇంట్లో చెప్పి ఒప్పించి బిడ్డను తీసుకెళదామనుకుంది. దీంతో ఆమె పొరుగున ఉండే కరంజికట్టా నివాసి అయిన పుష్ప అనే ఆమెకు తన బిడ్డను అప్పగించింది. నేను ఊరునుంచి వచ్చాక బిడ్డను తీసుకుంటాను అప్పటి వరకు జాగ్రత్తగా చూడమని అడిగింది.దానికి పుష్ప చంటిబిడ్డను తీసుకుని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది. అలా బిడ్డను అప్పగించి తన తల్లితో పాటు ఊరువెళ్లిందా యువతి.

Read more : Outdated Food: బూజు పట్టిన మటన్, పురుగులు పట్టిన రొయ్యలు

ఆ తరువాత 20 రోజులకు ఊరునుంచి తిరిగి వచ్చి తన బిడ్డను ఇవ్వమని పుష్పను అడిగింది. గత అక్టోబర్ 31న కోలార్‌కు తన పాపను ఇవ్వమని పుష్పను అడిగింది. కానీ బిడ్డేంటీ..ఇవ్వటమేంటీ?అంటూ పుష్ప అడ్డం తిరిగింది. దీంతో సదరు యువతి షాక్ అయ్యింది. ‘‘అదేంటక్కా..నేను ఊరు వెళుతు బిడ్డను చూసుకోమని ఇచ్చానుగా’’ అని గుర్తు చేయటానికి యత్నించింది. కానీ పుష్ప మాత్రం ‘‘నాకు నువ్వు బిడ్డను ఇవ్వటమేంటీ?మతిగానీ పోయిందా?’’ అంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో పుష్పను ఆమె శతవిధాలా బ్రతిమాలింది. నా బిడ్డను నాకు ఇచ్చేయక్కా..అంటూ ప్రాధేయపడింది. కానీ పుష్ప..మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బిడ్డ ఇవ్వలేదు అంటూ అబద్దాలాడింది. దీంతో నర్శింగ్ విద్యార్ధిని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి.. తనకు న్యాయం చేయాలని..నా బిడ్డను నాకు ఇప్పించండీ అంటూ పోలీసుల్ని కోరింది.

Read more :

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టిన గల్‌పేట పోలీసులు మునియప్ప, ఆయన కుటుంబ సభ్యులను ఈ విషయంపై విచారించారు. సీసీ కెమెరాలను పరిశీలించిగా సదరు యువతి పుష్పకు చంటిబిడ్డను ఇచ్చినట్లుగా కనిపించింది. విచారణ జరుగుతున్న క్రమంలో తమ కుటుంబ పరువు పోయిందనే మనస్తాపంతో పుష్ప కుటుంబ సభ్యులు ఐదుగురు విషం తాగారు. ఇది గమనించిన స్థానికులు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ముందు నలుగురు మృతి చెందగా.. అనంతరం చికిత్స పొందుతూ మునియప్ప కుమార్తె పుష్ప కూడా మరణించినట్లు గల్‌పేట పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు