Luxury Car Thief : పోలీసులకే సవాల్ విసిరిన లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్ర అరెస్ట్..!

Luxury Car Thief : దమ్ముంటే పట్టుకోండంటూ పోలీసులకే సవాల్ విసిరిన లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్ర సింగ్ షెకావాత్ అరెస్ట్ అయ్యాడు.

Luxury Car Thief : దమ్ముంటే పట్టుకోండంటూ పోలీసులకే సవాల్ విసిరిన లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్ర సింగ్ షెకావాత్ అరెస్ట్ అయ్యాడు. చిక్కడు.. దొరకుడు అన్నట్టుగా లగ్జరీ కార్లను దొంగతనం చేస్తూ పోలీసుకులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. పోలీసులకు చిక్కుకుండా పలు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పులు పెడుతున్న సత్యేంద్ర ఎట్టకేలకు బెంగళూరు పోలీసులకు చిక్కాడు. గత ఏడాది జనవరి నెలలో బంజారాహిల్స్ పరిధిలో ఓ స్టార్ హోటల్‌లో లగ్జరీ కారును దొంగతనం చేశాడు. షెకావత్‌ను ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని అమృతహల్లి పోలీసులు అరెస్టు చేశారు. పీటీ వారెంట్‌పై అతన్ని మూడు రోజుల కస్టడీ విచారణ కోసం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

రాజస్థాన్ జైపూర్‌కు చెందిన ఆర్మీ జవాన్ కుమారుడు సత్యేంద్ర షెకావత్.. 2003లో క్వాలిస్‌ను దొంగిలించడంతో అతడి నేరచరిత్ర మొదలైంది. ప్రస్తుతం బీఎండబ్ల్యూ, ఆడి, స్కార్పియో లాంటి అత్యంత ఖరీదైన కార్లే టార్గెట్‌‌గా షెకావత్‌ చోరీ చేస్తున్నాడు. 2003 నుంచి కార్ల దొంగగా మారిన సత్యేంద్రపై ఇప్పటివరకూ పది రాష్ట్రాల్లో 61 చోరీ కేసులు నమోదయ్యాయి.

అధునాతన సాంకేతికతో కార్లను దొంగతనం చేయడంలో సత్యేంద్ర దిట్ట. లగ్జరీ కార్లను మాయం చేస్తూ దమ్ముంటే నన్ను పట్టుకోడంటూ పోలీసులకు వీడియో కాల్ చేసి సవాల్ విసిరాడు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న సత్యేంద్రను ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. అతడు ఇప్పటివరకూ చోరీ చేసిన లగ్జరీ కార్లను రికవరీ చేసేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also : Telangana Police : దమ్ముంటే పట్టుకో! తెలంగాణ కాప్స్‌కు దొంగ సవాల్‌, 56 కార్లు చోరీ

ట్రెండింగ్ వార్తలు