America : ఇంట్లోకి చొరబడిన దొంగను కాలుస్తున్నట్లు కల కని.. నిద్ర మబ్బులో తుపాకీతో తనను తాను కాల్చుకున్న వ్యక్తి

అమెరికా ఇల్లినాయిస్ లోని లేక్ బారింగ్టన్ లో మార్క్ డికారా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతను నిద్రిస్తున్న సమయంలో ఒక కల వచ్చింది. ఓ వ్యక్తి తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది.

man shot himself

Man Shot Himself : మనకు కొన్నిసార్లు విచిత్రమైన కలలు వస్తుంటాయి. కొండ పైనుంచి కింద పడిపోతున్నట్లు, బావిలో పడిపోతున్నట్లు కలలు వస్తుంటాయి. భయపడి నిద్ర నుంచి లేచి చూసే సరికి మంచం పైనుంచి కిందపడిపోయి ఉంటాం. ఇలాంటి విచిత్రమైన కల ఓ వ్యక్తికి వచ్చింది. తన ఇంట్లోకి చొరబడిన దొంగను కాలుస్తున్నట్లు కల కన్న ఓ వ్యక్తి నిద్ర లేచి నిజంగానే తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని ఇల్లినాయిస్ లో చోటు చేసుకుంది.

ఏప్రిల్ 10న రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అమెరికా ఇల్లినాయిస్ లోని లేక్ బారింగ్టన్ లో మార్క్ డికారా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతను నిద్రిస్తున్న సమయంలో ఒక వచ్చింది. ఓ వ్యక్తి తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి చొరబడినట్లు అనిపించింది. దీంతో ఆందోళనకు గురైన డికారా నిద్ర మబ్బులోనే తన దగ్గర ఉన్న తుపాకీతో కలలో వచ్చిన దొంగపై కాల్పులు జరిపాడు. కానీ, బుల్లెట్ మిస్ ఫైర్ అయింది.

Achchennaidu : మరోసారి జగన్ ను గెలిపిస్తే తెలంగాణకు వలస వెళ్లాల్సిందే : అచ్చెన్నాయుడు

అది నేరుగా అతని కాలిలోకే దూసుకెళ్లింది. దెబ్బకు నిద్ర మొత్తం ఎగిరిపోయింది. బుల్లెట్ తగిలిన దెబ్బకు విలవిల్లాడిపోయాడు. తీవ్ర గాయం కావడంతో అధిక రక్తస్రావం కూడా అయింది. ఈలోపు తుపాకీ పేలిన శబ్ధం విన్న పొరుగింటి వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మార్క్ డికారాను విచారించారు. మార్క్ డికారా చెప్పింది విన్న పోలీసులు షాక్ అయ్యారు.

అయితే డికారా చెప్పింది నిజమా? లేదా నిజంగానే దొంగతనం జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చివరకు దొంగతనం జరిగినట్లు కల రావడంతో నిద్ర మబ్బులోనే కాల్పులు జరిపినట్లు
నిర్ధారించారు. అలాగే డికారాకు తుపాకీ కలిగి ఉండేందుకు లైసెన్స్ లేదని పోలీసుల విచారణలో తేలింది.

Uttar Pradesh : తాళి కట్టే సమయంలో అదనపు కట్నం డిమాండ్.. వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబీకులు

ఇల్లినాయిస్ లో తుపాకీ కలిగి ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఫైర్ ఆర్మ్ ఓనర్స్ ఐడెంటిఫికేషన్ కార్డు
తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. కానీ, చాలా రోజుల క్రితమే అతని ఐడెంటిఫికేషన్ కార్డు రద్దు అయింది. అయినా డికారా రివాల్వర్ ను ఉపయోగిస్తున్నాడు. దీంతో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటంతోపాటు నిర్లక్ష్యంగా తుపాకీ వినియోగించిన నేరాల కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు