Fraud Alert : ఆన్‌‌లైన్ యాప్ మోసం..రూ. 36 లక్షలు పొగొట్టుకున్న హైదరాబాద్ వాసి

FQ అనే ఆన్ లైన్ యాప్ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే వెనుకాముందు ఏమాత్రం ఆలోచించకుండా..ఆ నెంబర్ కు ఫోన్ చేశాడు.

Online App Fraud : హైదరాబాద్ మహానగరంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువవుతున్నారు. మహా నగరంలో మాయగాళ్లు పెరిగిపోతున్నారు. అందినకాడికి దోచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు కొందరు కేటుగాళ్లు. ప్రధానంగా సైబర్ మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. సెల్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ లు నమ్మవద్దని, పర్సనల్ విషయాలను ఎవరికీ చెప్పవద్దని అటు నిపుణులు, ఇటు పోలీసులు సూచిస్తున్నా..కొంతమంది డబ్బులకు ఆశపడి మోసపోతున్నారు. తాము మోసపోయామని చివరిలో గ్రహించి..లబోదిబోమంటూ..తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించడం కామన్ అయిపోయింది. తాజా..అధికంగా డబ్బులు వస్తాయని ఆశపడి…రూ. 36 లక్షలు మోసపోయాడో ఓ వ్యక్తి.

Read More : Beggar Death Viral : యాచకుడి అంతిమ‌యాత్ర‌కు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు..ఘనంగా అంతిమ వీడ్కోలు

హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సెంసుద్దీన్, అతని కొడుకు నివాసం ఉంటున్నారు. సెంసుద్దీన్ ఫోన్ కు FQ అనే ఆన్ లైన్ యాప్ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే వెనుకాముందు ఏమాత్రం ఆలోచించకుండా..ఆ నెంబర్ కు ఫోన్ చేశాడు. డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే..భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని నమ్మబలికారు. దీంతో సెంసుద్దీన్ 21 లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేశాడు. అంతేగాక..తన కొడుకు చేత రూ. 15 లక్షలను కూడా అందులో ఇన్వెస్ట్ మెంట్ చేయించాడు. కొన్ని రోజుల అనంతరం ఇన్వెస్ట్ చేసిన దానికి డబ్బులు రాలేదు. ఏమై ఉంటుందని..ఆలోచించి..ఆ నెంబర్ కు ఫోన్ చేశాడు. అంతే…ఫోన్ పని చేయలేదు. తాను మోసపోయానని గ్రహించి…సైబర్ క్రైం పోలీసులు ఆశ్రయించాడు. జరిగిందంతా చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు