Punjab Election : అకాలీదళ్ అధ్యక్షుడి బావమరిదిపై డ్రగ్స్ కేసు

 వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో కీలక ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శిరోమ‌ణి అకాలీద‌ళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు‌, మాజీ డిప్యూటీ సీఎం సుక్బీర్ సింగ్ బాద‌ల్

Punjab Election : వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో కీలక ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శిరోమ‌ణి అకాలీద‌ళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు‌, మాజీ డిప్యూటీ సీఎం సుక్బీర్ సింగ్ బాద‌ల్ బావ‌మ‌రిది అయిన మాజీ మంత్రి విక్రం మ‌జిధియాపై పంజాబ్ పోలీస్ క్రైం బ్రాంచ్ డ్ర‌గ్స్ కేసు న‌మోదు చేసింది. మ‌జిధియా.. డ్ర‌గ్స్ అక్ర‌మ ర‌వాణా, డ్ర‌గ్స్ పంపిణీ, విక్రయాల‌కు స‌హ‌కారం అందించ‌డ‌మే కాకుండా డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్‌కు నేర‌పూరిత కుట్ర ప‌న్నార‌ని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

మజిథియా పేరును నేరుగా ప్రస్తావించకుండా పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ ఓ ట్వీట్ లో… “ఫిబ్రవరి 2018 STF నివేదిక ఆధారంగా డ్రగ్స్ వ్యాపారంలో ప్రధాన నిందితులపై పంజాబ్ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. తాజా ప‌రిణామం పంజాబ్‌ను కుదిపేసిన అంశాల‌పై ఏండ్ల‌త‌ర‌బ‌డి ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించిన శక్తివంతమైన వారందరికీ ఇది చెంపదెబ్బ. బాదల్ కుటుంబం మరియు కెప్టెన్ నడిపిన అవినీతి వ్యవస్థపై 5.5 సంవత్సరాల పోరాటం తర్వాత.. ఈడీ, ఎస్‌టీఎఫ్ ఇచ్చిన నివేదిక‌ల‌పై కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్ర‌భుత్వం నాలుగేండ్ల పాటు నాన్చిన అనంతరం చివరకు ఇప్పుడు విశ్వ‌స‌నీయ‌త‌కు మారుపేరైన అధికారులు తీసుకున్న తొలి చ‌ర్య ఇదే”అని సిద్ధూ ట్వీట్ చేశాడు. డ్ర‌గ్ మాఫియా వ్య‌తిరేక పోరాటంలో ఎఫ్ఐఆర్ తొలి అడుగు మాత్ర‌మేన‌ని, డ్ర‌గ్ మాఫియా వెనక ప్ర‌ధాన నిందితుల‌కు క‌ఠిన శిక్ష విధించిన‌ప్పుడే న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు.

అయితే ఈ కేసు రాజకీయ కక్ష్య సాధింపు చర్యేనని శిరోమణి అకాలీదళ్ నేత,మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తెలిపారు. అన్యాయానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ముక్తసర్ టౌన్ లో విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు.

ALSO READ Election Laws Bill : ఓటర్ ఐడీని ఆధార్ తో అనుసంధానించే బిల్లుకి రాజ్యసభ ఆమోదం

ట్రెండింగ్ వార్తలు