West Bengal: హత్య కేసులో జైలుకెళ్లిన ఆ ఇద్దరు ప్రేమలో పడ్డారు.. పెరోల్ మీద బయటికి వచ్చి పెళ్లి చేసుకున్నారు

మేమిద్దరం బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో నిర్బంధించబడ్డాము. అదే రోజు మా హౌస్‌మేట్స్ మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము అక్కడ నుంచి ఒకరినొకరు తెలుసుకున్నాము. కొద్ది కొద్దిగా మా మధ్య మాటలు పెరిగాయి

Inmates Fell in Love: కర్కశమైన జైలు గోడల మధ్య నేరమొక్కటే ఉండదు. ప్రేమలు, ఆప్యాయతలు కూడా ఉంటాయి. జైలుకు వెళ్లిన వారు స్నేహితులవ్వడం, బయటికి వచ్చాక కలిసి ఉండడం లాంటివి చూస్తూనే ఉంటాం. ముల్ల కంచె లోపల స్నేహాలే కాదు ప్రేమలు కూడా పుడతాయి. ఇలాంటి ఒక ఘటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తూర్పు బర్ధమాన్ జిల్లాలోని జైలులో చోటు చేసుకుంది. వేరు వేరు హత్యా నేరాల్లో దోషులుగా రుజువై జైలుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడ్డారు. అనంతరం కోర్టు నుంచి పెరోల్ తీసుకుని పెళ్లి చేసుకున్నారు.

Govt Tomato Sale : సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం టమాటాల అమ్మకాలు .. కిలో ఎంతంటే..?

ఇద్దరు నేరస్తులు హత్యా నేరంలో దోషులుగా తేలి బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ హోంలో ఖైదు చేయబడ్డారు. అక్కడే ఇద్దరు కులుసుకున్నారు. అనంతరం స్నేహం చిగురించి, అది కాస్త ప్రేమగా మారింది. వారి సంబంధం గురించి వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వివాహ వేడుక కోసం, ద్వయం ఐదు రోజుల పెరోల్‌పై విడుదల అయ్యారు. అనంతరం తూర్పు బర్ధమాన్‌లోని మాంటేశ్వర్ బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్‌లో ముస్లిం చట్టం ప్రకారం వివాహం చేసుకున్నారు.

CP CV Anand : కేబీఆర్ పార్క్ చుట్టూ 264 సీసీ కెమెరాలు.. 15 నిమిషాల్లో నేరం చేసిన వ్యక్తిని గుర్తిస్తున్నాం : సీపీ సీవీ ఆనంద్

ఇంతకీ వారి పేర్లు చెప్పనేలేదు కదు. వధువు పేరు సహనారా ఖాటున్, వరుడి పేరు అబ్దుల్ హసీమ్. కాగా, ఈ విషయమై అబ్దుల్ మాట్లాడుతూ “మేమిద్దరం బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో నిర్బంధించబడ్డాము. అదే రోజు మా హౌస్‌మేట్స్ మమ్మల్ని కలవడానికి వచ్చారు. మేము అక్కడ నుంచి ఒకరినొకరు తెలుసుకున్నాము. కొద్ది కొద్దిగా మా మధ్య మాటలు పెరిగాయి. తరువాత మా మధ్య సంబంధం పెరిగి పెద్దదైంది. మా జీవితంలోని చీకటి నుంచి బయటపడి, మా జీవితాలను చక్కగా గడపాలని, ఎటువంటి విపత్తులో పడకూడదని కోరుకుంటున్నాము” అని చెప్పాడు.

Janasena: జనసేన మీడియా సమావేశాన్ని అడ్డుకునేందుకు భారీగా తరలివచ్చిన వాలంటీర్లు.. ఉద్రిక్తత

ఇక సహనారా మాట్లాడుతూ ‘‘మేం జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత.. ఈ జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించాలి. అందరిలాగే జీవించాలని ఉంది’’ అని చెప్పుకొచ్చింది. బీర్భూమ్ నివాసి ఖతున్ గత ఆరేళ్లుగా జైలులో ఉండగా, అస్సాంకు చెందిన అబ్దుల్ హసీమ్ ప్రస్తుతం సెంట్రల్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఎనిమిదేళ్లుగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. బర్ధమాన్ సెంట్రల్ కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్‌లో వివాహం జరగడం ఇదే మొదటిసారి. పెళ్లి చేసుకున్న అనంతరం ఇద్దరూ మళ్లీ జైలుకు వెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు