Railways Minister Ashwini Vaishnaw: ఒడిశా రైళ్ల ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ

Railways Minister Ashwini Vaishnaw:ఒడిశా రాష్ట్రంలో మూడు రైళ్ల ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ రైళ్ల ప్రమాదాలు ఎలా జరిగాయి? ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.

రైళ్ల ప్రమాద స్థలం నుంచి ఇప్పటివరకు 120 మృతదేహాలను వెలికితీశామని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ఒడిశా అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ సుధాంషు సారంగి చెప్పారు. ప్రమాద స్థలంలో తీవ్రంగా గాయపడిన 600 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నామని ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా చెప్పారు.

Odisha trains accident: మూడు రైళ్ల ఢీ: 207 మంది దుర్మరణం, 900 మందికి గాయాలు

ఈ రైలు ప్రమాదంలో బాధితులకు అన్నిరకాల సహాయం చేయాలని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు.క్షతగాత్రులకు చికిత్స అందించడానికి ఎయిమ్స్ ను సిద్ధం చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు