Medico Preeti Case: ర్యాగింగ్ కాదు, ఆ కారణం వల్లే ఆత్మహత్యాయత్నం.. వైద్య విద్యార్థి ప్రీతి కేసుపై వరంగల్ సీపీ కీలక విషయాలు

ఈ కేసు విషయంలో పోలీసులు స్పందించలేదన్నది అవాస్తవమని అన్నారు. ప్రీతి తండ్రికి పోలీసులతో ఉన్న పరిచయాల వల్ల ముందుగా వ్యక్తిగత సహాయం తీసుకున్నారని, ఆ వెంటనే పోలీసులు స్పందించారని తెలిపారు. ఈ కేసుపై ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని, మరింత మంది విద్యర్థుల్ని విచారించాల్సి ఉందని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు అవాస్తవమని, అలాంటి ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని సీపీ రంగనాథ్ హెచ్చరించారు.

Medico Preeti Case: వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలోని పీజీ చదువుతున్న వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణం ర్యాగింగ్ కాదని, ఇందులో లవ్ జిహాద్ లాంటి కోణం లేదని, కాలేజీలో సీనియర్-జూనియర్ మధ్య ఉన్న బాసిజం ఆమెను మానసికంగా వేధించి ఆత్మహత్యకు పురిగొల్పిందని ఆయన వెల్లడించారు. నిందితుడు, సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్‭ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Congress Plenary: కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం.. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కీలక అంశాలపై తీర్మానాలు

ఆత్మహత్య చేసుకోవడానికి ప్రీతి ఏం తీసుకుందో స్పష్టంగా తెలియడం లేదని, రక్తనమూనాలు ఇప్పటికే పంపామని, అవి వస్తే విషయం ఏంటనేది తెలుస్తుందని అన్నారు. ఆత్మహత్యకు ముందు గూగుల్ సెర్చ్ చేసినట్లు తెలిసిందని, కాగా తమకు సక్సీ నైల్ కోలిన్ అనే ఇంజక్షన్ దొరికిందని అన్నారు. ‘‘ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. ప్రీతి ఫోన్ పరిశీలిస్తున్నాం. ఫోన్ చాటింగ్‭లో అవమాన పరుస్తున్నావని సైఫ్‭ను ప్రీతి అడుగుతుంది. సైఫ్ టార్గెటెడ్‭గా హరాస్ చేశాడు. చాటింగ్‭ను వాట్సాప్ గ్రూపులో పెట్టి అవమానించాడు. బుర్ర తక్కువుందంటూ అందరి ముందు హేళన చేశాడు’’ అని అన్నారు.

PG Medico Health Update: కాస్త మెరుగుపడ్డ ప్రీతి ఆరోగ్యం.. నాణ్యమైన వైద్యం అందిస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్

ఇంకా వివరాలు వెల్లడిస్తూ ‘‘కాలేజీలో సీనియర్లను సర్ అనే అలవాటు ఉంది. దాన్ని ఆసరగా చేసుకుని సైఫ్ బాసులా వ్యవహరించాడు. ప్రీతి తెలివిగల అమ్మాయి, ప్రశ్నించేతత్వం ఉన్న అమ్మాయి. దాన్ని సైఫ్ సహించలేకపోయాడు. మరింత ఇబ్బందికి గురి చేశాడు. డిసెంబర్ నుంచి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది భరించలేక ఈ నెల 20న తన దు:ఖాన్ని తండ్రితో చెప్పుకుంది. ఆయన వెంటనే మట్టెవాడ ఎస్.హెచ్.వో శంకర్ నాయక్‭కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఏసీపీని కలిసేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని ఆ మర్నాడే (21) ఆసుపత్రి హెచ్.వో.డి, ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు’’ అని తెలిపారు.

Summer Health Problems : వేసవి కాలంలో ఎదురయ్యే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవే?

అనంతరం సైఫ్ సహా ఇతర విద్యార్థుల్ని ప్రిన్సిపాల్ పిలిచి మాట్లాడారు. ఆ రోజు అనంతరం యధావిధిగానే ఉంది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తననేమైనా చేస్తారా అని ప్రీతికి భయం చుట్టుకుందట. తన ఫ్రెండును సైతం ఈ విషయమై అడిగిందట. ఆ తర్వతే ఆత్మహత్యాయత్నం చేసినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎలాంటి రాజకీయం చేయకుండా నిష్పాక్షికంగా విచారణ చేపట్టామని, ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్ వేధింపులే కారణమని మరోమారు స్పష్టం చేశారు.

Delhi Murder: ఢిల్లీలో దారుణం.. ముప్పై రూపాయల కోసం వ్యక్తి హత్య.. నిందితుల అరెస్ట్

ఈ కేసు విషయంలో పోలీసులు స్పందించలేదన్నది అవాస్తవమని అన్నారు. ప్రీతి తండ్రికి పోలీసులతో ఉన్న పరిచయాల వల్ల ముందుగా వ్యక్తిగత సహాయం తీసుకున్నారని, ఆ వెంటనే పోలీసులు స్పందించారని తెలిపారు. ఈ కేసుపై ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని, మరింత మంది విద్యర్థుల్ని విచారించాల్సి ఉందని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు అవాస్తవమని, అలాంటి ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని సీపీ రంగనాథ్ హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు