Lok Sabha elections 2024: ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా సీఎం నితీశ్ కుమార్.. సీతారాం ఏచూరి ఏమన్నారంటే?

 ప్రతిపక్షాల్లో ఐక్యత తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. ప్రధాన మంత్రి కావడానికి ఉండాల్సిన లక్షణాలు నితీశ్ కుమార్‌కు ఉన్నాయని, ఇందులో ఎటువంటి సందేహమూ లేని చెప్పారు. అయితే, దీనిపై చర్చించే సమయం ఇంకా ఆసన్నం కాలేదని అన్నారు. ప్రతిపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయంపై చర్చించి, ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని, దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రస్తుతం ప్రతిపక్షాల ఐక్యతపైనే దృష్టి సారించాలని చెప్పారు.

Lok Sabha elections 2024: ప్రతిపక్షాల్లో ఐక్యత తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రధాన మంత్రి కావడానికి ఉండాల్సిన లక్షణాలు నితీశ్ కుమార్‌కు ఉన్నాయని, ఇందులో ఎటువంటి సందేహమూ లేని చెప్పారు. అయితే, దీనిపై చర్చించే సమయం ఇంకా ఆసన్నం కాలేదని అన్నారు. ప్రతిపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరన్న విషయంపై చర్చించి, ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని, దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రస్తుతం ప్రతిపక్షాల ఐక్యతపైనే దృష్టి సారించాలని చెప్పారు.

ఇవాళ ఏచూరి  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఎన్నికల తరువాతే కూటమి ఏర్పడుతుందని అన్నారు. ఉదాహరణకు 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. 1998లో ఎన్డీఏ ప్రభుత్వం, 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. వారంతా ఎన్నికల తర్వాతే ప్రధాన మంత్రి అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అందుకే 2024 ఎన్నికల ముందు ప్రతిపక్షాల ఐక్యతకే తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఎన్డీఏను వదిలి బిహార్ లో నితీశ్ కుమార్ సెక్యులర్ ఫ్రంట్ తో చేతులు కలపడం స్వాగతించదగ్గ అంశమని ఏచూరి చెప్పారు.

China vs America: చైనా-అమెరికా పరస్పరం సైబర్ దాడులు?.. అగ్రరాజ్యంపై మళ్ళీ మండిపడ్డ డ్రాగన్

ట్రెండింగ్ వార్తలు