5 Best Foods : కొవిడ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ నుంచి రిలీఫ్ కోసం ఈ ఐదు ఫుడ్స్ తీసుకోండి..!

కొవిడ్ టీకా వేయించుకున్నారా? అయితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతున్నారా? డోంట్ వర్రీ.. టీకా దుష్ర్పభావాల నుంచి తొందరగా రిలీఫ్ పొందాలంటే ఈ ఐదు ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు పోషక నిపుణులు..

5 best foods for COVID Vaccine Side Effects : కొవిడ్ టీకా వేయించుకున్నారా? అయితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్‌తో బాధపడుతున్నారా? డోంట్ వర్రీ.. టీకా దుష్ర్పభావాల నుంచి తొందరగా రిలీఫ్ పొందాలంటే ఈ ఐదు ఫుడ్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు పోషక నిపుణులు.. టీకా వేసిన చోట నొప్పిగా ఉండటం.. తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, బలహీనత, అలసటగా వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో శరీరానికి చాలా శక్తితో పాటు పోషకాలు, ప్రోటీన్లు అవసరం పడుతుంది. అందుకే తినే ఆహారంలో పోషక విలువులన్న వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి త్వరగా రిలీఫ్ పొందాలంటే ఈ 5 బెస్ట్ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు.

1. పసుపు (Tumeric) :
మన వంటిట్లో పసుపు (Tumeric) లేకుండా కూరలు ఉండవు. పసుపు యాంటీ బ్యాక్టిరీయాల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ ఫ్లేమెంటరీ, అనాల్జేసిక్, యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ సర్వరోగ నివారణిగా పనిచేస్తుంది. అంతేకాదు.. పసుపు రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. కర్‌క్యుమిన్‌ (curcumin) అనే పదార్థం ఉంటుంది. థెరపెటిక్ ఏజెంట్ గా పసుపు అద్భుంగా పనిచేస్తుంది.

 

 

 

2. అల్లం (Ginger) :

అల్లం అనేది కేవలం వంటల్లో రుచి కోసమే కాదు.. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎమినో యాసిడ్స్ (Amino Acids), ముఖ్యమైన ఎంజైములు ఉంటాయి. కడుపులో మంటను తగ్గించగలదు.. జీర్ణసంబంధిత సమస్యలను కూడా తగ్గించగలదు. ఒత్తిడి నుంచి కూడా తొందరగా బయటపడొచ్చు. టీలో కూడా అల్లాన్ని వాడొచ్చు. అలా కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు.

3. ఆకు కూరలు (Green Leafy Vegetables) :
ఆకు కూరల్లో చాల ఫైబర్ ఉంటుంది. విటమిన్ సి, ప్రొవిటమిన్ ఎ కార్టినాయిడ్స్, ఫోలేట్, మాంగనీస్ వంటి ఎన్నో పోషక విలువులు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ కె వంటి లోపంపై కూడా బాగా పనిచేస్తుంది. అంతేకాదు.. మోటబాలిజాన్ని అదుపులో ఉంచుతాయి. తక్కువగా ఆకలి వేస్తుంది. వ్యాక్సినేషన్ తర్వాత ఆకు కూరలు బెస్ట్ సప్లిమెంట్ ఫుడ్ గా చెప్పవచ్చు.

4. వాటర్ రిచ్ ఫుడ్స్ (Water- rich foods) :
వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారం కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాక్సినేషన్ తర్వాత తరచూ డీహైడ్రేషన్ అవుతుంటుంది. అప్పుడు ఈ వాటర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా హైడ్రేట్ గా ఉండొచ్చు. శరీర ఉష్ణోగ్రతను సాధారణంగా ఉండేలా చేస్తాయి. మానసిక స్థితిని కూడా అదుపులో ఉంచుతాయి. మంచి పోషణ లవణాలతో నీరు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే.. చాలా చురుకుగా ఉంటారు. ఆరెంజ్, మెలాన్లు, దోసకాయలు, పుచ్చకాయలు, కర్భూజ వంటి వాటర్ కంటెంట్ ను తరచూ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను ఎన్నో పొందవచ్చు.

5. మల్టీగ్రెయిన్ ఫుడ్స్ (Multi Grains) :
మల్టీ గ్రెయిన్ ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జీర్ణవ్యవస్థ (Digestive System) చురుకుగా ఉండేందుకు ఎంతో సాయపడతాయి. అధిక శక్తిని ఇస్తాయి. ఫైబర్ రిచ్ కంటెంట్ అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ డైట్ లో ఈ మల్టీ గ్రెయిన్ చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండటంతో పాటు నూతన ఉత్తేజంతో ఉండొచ్చు. వ్యాక్సినేషన్ తర్వాత ప్రతిఒక్కరూ తమ డైట్ లో ఈ మల్టీ గ్రెయిన్ వాడటం ద్వారా తొందరగా టీకా సంబంధిత సమస్యల నుంచి తొందరగా బయటపడొచ్చు.

ట్రెండింగ్ వార్తలు