CM Kejriwal confidence motion: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేజ్రీవాల్.. కేంద్ర సర్కారుకు ప్రజల శాపం తగులుతుందని ఆగ్రహం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘ఆపరేషన్ లోటస్’ను రుజువు చేయడానికే తాను ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టానని అన్నారు. తమ విచ్ఛిన్నం చేయడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురికాకుండా మెజారిటీని నిరూపించుకోవడానికి తాను బలపరీక్ష ఎదుర్కోవాలనకుంటున్నానని చెప్పారు. పార్టీ మారడానికి ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లను బీజేపీ ఆఫర్ చేసిందని అన్నారు.

CM Kejriwal confidence motion: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘ఆపరేషన్ లోటస్’ను రుజువు చేయడానికే తాను ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టానని అన్నారు. తమ విచ్ఛిన్నం చేయడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురికారని చెప్పడానికి, తాను మెజారిటీని నిరూపించుకోవడానికి తాను బలపరీక్ష ఎదుర్కొంటున్నానని చెప్పారు. పార్టీ మారడానికి ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లను బీజేపీ ఆఫర్ చేసిందని అన్నారు.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ పన్నాగం పన్నిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము అవినీతికి వ్యతిరేకమని బీజేపీ చెప్పుకుంటోందని, అయితే, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజల శాపం కేంద్ర సర్కారు తగులుతుందని అన్నారు.

కాగా, ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ తన ఇంట్లో జరిగిన సమావేశానికి ఢిల్లీలోని ఆప్‌కి చెందిన 62 మంది ఎమ్మెల్యేలలో 53 మంది మాత్రమే హాజరైన విషయం తెలిసిందే. దీంతో ఆయా నేతలు బీజేపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. అలాగే, ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఇటీవల ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో 15 మంది నిందితుల జాబితాలో సిసోడియా ఏ1గా ఉన్నారు.

India Covid-19 cases: దేశంలో 8 వేల దిగువకు వచ్చిన కరోనా కొత్త కేసులు

ట్రెండింగ్ వార్తలు