Bharat Jodo Yatra 7th day: తన పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయిందన్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన 'భారత్ జోడో యాత్ర' 7వ రోజు కొనసాగుతోంది. ఇవాళ కేరళలోని కనియాపురం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ యాత్రను మొదలుపెట్టారు. కేరళలో ఈ యాత్ర 17 రోజుల పాటు ఉంటుంది. ఇవాళ యాత్ర ప్రారంభించేముందు రాహుల్ గాంధీ ట్విటర్ లో దీనిపై స్పందించారు. ‘‘భారతదేశ కలను నాశనం చేశారు. మళ్ళీ భారతదేశ కలను సాకారం చేయడానికి దేశం మొత్తాన్ని మేము ఏకం చేస్తున్నాం. ఇప్పటికి 100 కిలోమీటర్లు పూర్తయింది. ఇది ప్రారంభం మాత్రమే’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Bharat Jodo Yatra 7th day: కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ‘భారత్ జోడో యాత్ర’ 7వ రోజు కొనసాగుతోంది. ఇవాళ కేరళలోని కనియాపురం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ యాత్రను మొదలుపెట్టారు. కేరళలో ఈ యాత్ర 17 రోజుల పాటు ఉంటుంది. ఇవాళ యాత్ర ప్రారంభించేముందు రాహుల్ గాంధీ ట్విటర్ లో దీనిపై స్పందించారు. ‘‘భారతదేశ కలను నాశనం చేశారు. మళ్ళీ భారతదేశ కలను సాకారం చేయడానికి దేశం మొత్తాన్ని మేము ఏకం చేస్తున్నాం. ఇప్పటికి 100 కిలోమీటర్లు పూర్తయింది. ఇది ప్రారంభం మాత్రమే’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

కాగా, పాదయాత్రలో రాహుల్ వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. స్థానికులతో మాట్లాడుతూ రాహుల్ యాత్ర ముందుకు కదులుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మొత్తం 3,500 కిలోమీటర్ల మేర 150 రోజుల పాటు ఈ పాదయాత్ర జరగనుంది. దాదాపు 12 రాష్ట్రాల మీదుగా ఆ యాత్ర కొనసాగుతుంది.

ఈ నెల 30న తమిళనాడులో రాహుల్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ప్రతిరోజు 25 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేయాలని రాహుల్ నిర్ణయం తీసుకున్న విషక్ష్ం తెలిసిందే. కాంగ్రెస్ ఆ పాదయాత్ర ద్వారా ఉనికి కోసమే ప్రయత్నిస్తోందంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా రోజువారీ కేసులు… కొత్తగా 4,369 నమోదు

ట్రెండింగ్ వార్తలు